నేరగాళ్ల పోటీని ఆపలేని చట్టాలు మనవి | Our laws cannot control crime leaders contest in elections | Sakshi
Sakshi News home page

నేరగాళ్ల పోటీని ఆపలేని చట్టాలు మనవి

Published Sat, Apr 5 2014 1:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

నేరగాళ్ల పోటీని ఆపలేని చట్టాలు మనవి - Sakshi

నేరగాళ్ల పోటీని ఆపలేని చట్టాలు మనవి

గెస్ట్‌కాలమ్: ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్: మంచివాళ్లే పోటీ చేయాలని, మంచివారినే జనం ఎన్నుకోవాలని రాజ్యాంగంలో ఒక మాట రాస్తే సరిపోయేది కదా! ఆ విధంగా ఎందుకు రాయలేదు? అని ఒక విద్యార్థి అడిగాడు. చాలా మంచి ఆలోచన. కానీ చెడ్డ వాడంటే ఎవరు? మంచి అంటే అర్థమేమిటి? వీటికి నిర్వచనాలు లేవు. ఉండవు. రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా చెడ్డవారని కాదు కానీ మంచి వాళ్లకు అంతగా స్థానం లేదని సాధారణ అభిప్రాయం. ఇప్పుడు పోటీ చేస్తున్న వారిలో కూడా ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందనీ, అంతగా చదువుకున్న వారు కాదని, డబ్బు విపరీతంగా సంపాదించిన వారు ఓట్లడుగుతున్నారని ఒక వార్త ప్రచురించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంలో సుప్రీం కోర్టు పోటీ చేసే అభ్యర్థులు తమ నేర గతాన్ని, విద్యార్హతలను(ఉన్నా లేకున్నా), ఆర్థిక స్థోమతను తామే ప్రమాణపత్రంలో వివరించాలని ఆదేశించింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్పును వ్యతిరేకించాయి.
 
 అంటే అర్థమేమిటీ? ఎవరికీ తమ అభ్యర్థుల గతం తెలియడానికి వీల్లేదనీ, వారి గతాన్ని రహస్యంగా ఉంచాలని రాజకీయ పార్టీ లు చివరిదాకా ప్రయత్నం చేశాయి. చివరికి అన్ని పార్టీలూ కలిపి సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా అభ్యర్థులు ఆ విధంగా ఏ ప్రమాణపత్రమూ దాఖలు చేయడానికి వీల్లేదని పార్లమెంటు ఒక చట్టం కూడా చేసింది. ఈ విధంగా సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేయడానికి మాత్రమే చట్టం చేయడానికి వీల్లేదని, ప్రజలకు తమ అభ్యర్థులను గురించి తెలుసుకునే హక్కును కాలరాయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించాకే, అభ్యర్థులు తమ నేర, విద్య, ఆర్థిక గతం చెప్పాలని నిర్దేశిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. అభ్యర్థులు అప్పటి నుంచి తమ నామినేషన్‌తో పాటు తామెన్ని నేరాలు చేశారు, ఎంతవరకు చదివారు, ఎంత సంపాదించారు అనే వివరాలతో ప్రమాణపత్రం ఇవ్వక తప్పడం లేదు. కనుక వీరి గతం గురించి ఓటర్లకు ఇప్పుడు తెలుస్తున్నది.
 
అందరినీ తిరస్కరించే అవకాశం
 ఒకపార్టీ అభ్యర్థి పది హత్యలు  చేసిన కేసుల్లో బోనెక్కబోతున్నారు. బెయిల్ మీద ఉండడం వల్ల జైల్లో లేరు. మరొక అభ్యర్థి ఐదు హత్యలు చేసినట్టు కేసులన్నాయని చెప్పుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలన్నది సవాల్. ఎక్కువ నేరాలు చేసిన వాడికి ఓటు వేయవద్దని ఒక ఓటరు అంటే, మరొకరు తక్కువ నేరాలు చేసిన వాడికే ఓటు వేయకూడదు అన్నాడట. అదేమిటని నిలదీస్తే తక్కువ నేరాలు చేసిన వాడు పోటీలో మరిన్ని నేరాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎక్కువ నేరాలు చేసినవాడయితే నేరాల పోటీ ఉండదు అని తర్కం లేవదీశాడు. ఒకవేళ ఈ ఇద్దరే అభ్యర్థులుగా ఉంటే వీరిలో ఒకరికే ఎందుకు ఓటు వేయాలి? ఈ ఇద్దరినీ తిరస్కరించే ఓటు వేసే స్వేచ్ఛ లేదా అన్నది మరో ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వేయడానికి తగిన బలం కూడా ఏడీఆర్ అనే సంస్థ వేసిన వ్యాజ్యం వల్ల జనానికి చేకూరింది. లేకపోతే అదీ లేదు. వీరిద్దరినీ తిరస్కరించే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు గత సంవత్సరం మరో కేసులో తీర్పుచెప్పి సంచలనం సృష్టించింది.
 
 మరొక దారుణం ఉంది. అదేమంటే నేరం రుజువైన తరువాత కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కొనసాగించవచ్చని ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఒక నియమం రాసుకున్నారు  ఇది జనంపైన 1950లలోనే ఆనాటి నేతలు చేసిన అసలు సిసలు కుట్ర. వూవుూలు నేరస్తులైతే నేరం కింద కోర్టులో రుజువుకాగానే జైలుకు పోతారు. పైకోర్టులో బెరుుల్ దొరికితే తప్ప. కాని రాజకీయు నేరగాళ్లరుుతే నేరు రుజువు కాగానే జైలుకు పోకుండా పార్లమెంటుకో అసెంబ్లీకో వూవుూలుగా వెళ్లిపోగలరు.
 
 వారిపై నిషేధం ఉండదు. సుప్రీంకోర్టు మళ్లీ ఓటర్లను ఈ నేరగాళ్ల నుంచి రక్షించింది. నేరం రుజువైన తరువాత అప్పీలు దాఖలైతే చాలు అనర్హత వారుుదా పడుతుందని సభ్యుడుగా కొనసాగవచ్చని ప్రజాప్రాతినిధ్యచట్టంలో చేర్చినా ఈ చెత్త నియువూన్ని గత సంవత్సరం ఒక సంచలన తీర్పులో సుప్రీంకోర్టు రద్దు చేసింది. కింది కోర్టులో నేరం రుజువైన వురుక్షణం ఎమ్మెల్యేలు, ఎంపీలు తవు సభ్యత్వాన్ని కోల్పోతారని తేల్చి చెప్పింది. అంతేకాదు విధించిన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు, ఆ తరువాత మరో ఆరేళ్లపాటు ఆ నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయుడానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు వివరించింది.
 
 ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీగారు ఉండేవారు. ఆయునమీద కనీసం పది కేసులున్నారుు. చాలా నేరాలు రుజువైనారుు. అప్పీలు పెండింగ్‌లో ఉంది. కాని అనేక కోర్టుల్లో ఆయున నిందితుడిగా నిలబడాల్సి ఉంది. నెలలో దాదాపు పది రోజులు కోర్టుల్లో ఉండకతప్పదు. తీరిక దొరికితే ఆయున పార్లమెంటుకు హాజరవుతాడు. ప్రజల బాధలు పార్లమెంటులో వివరిస్తాడు. అందుకు ప్రజాకోశాగారం నుంచి లక్షల రూపాయుల వేతనం పారితోషికం, భత్యం, ఉచిత ప్రయూణం, నివాస సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. ఇది ఎంత అన్యాయుం? అప్పీలు కాలంలో అనర్హత రాదనే నియువుం పోరుుంది.
 
 కాని తీవ్ర ఆరోపణలున్నా అనర్హత రాని నియువుం ఇంకా ఉంది. అంటే రేప్‌లు, హత్యలు, లంచం నేరాలు చేసిన వారు, ఎన్నికల నేరాలు చేసిన వారు, ప్రజాధనం దోచుకున్నవారు ఆ నేరాల విచారణ జరుగుతున్నంత కాలం పోటీకి అర్హులే. గెలిచి వుంత్రులు, వుుఖ్యవుంత్రులు కూడా కావచ్చు. దీనికి వారు చేయువలసిందల్లా ఒక్కటే. నేర విచారణను ఏదో విధంగా కొనసాగిస్తూ వారుుదాల మీద వారుుదాలు తీసుకుంటూ, ప్రతిదానికి హైకోర్టు, సుప్రీంకోర్టుదాకా అనేకానేక పిటిషన్లు వేస్తూ ఐదేళ్ల పదవీకాలాన్ని వురోసారి ఎన్నికైతే వురో ఐదేళ్ల పదవీకాలాన్నా గడిపేంత కాలం నేర విచారణను వారుుదా వేరుుంచుగలిగితే చాలు. అందులో చాలా నిపుణులైన లాయుర్లు ఈ దేశంలో ఉన్నారు. చట్టాల్లో ఉన్న నియువూలను ఇటువంటి నేరగాళ్లమీద నేరాలు తొందరగా రుజువు కాకుండా కాలాన్ని గడపడంలో నిష్ణాతులు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఇటీవల విసిగిపోరుు రాజకీయు నేరగాళ్ల మీద కేసులు ఏడాదిలోగా వుుగించాలని ఆదేశించింది. నేరగాళ్లయిన అభ్యర్థులే తమ నేరాలను తామే చెప్పాలనే చట్టం ఆ విధంగా వచ్చిన తొలి ఓటరు సమాచార చట్టం అని చెప్పుకోవచ్చు.
 
 కొందరు అంతకుముందు నేరాలు చేయకపోయినా ఓటుకు నోటు ఇవ్వడం అనే లంచం నేరం చేస్తుంటారు. వారి నుంచి లంచం తీసుకున్న వారు కూడా నేరస్తులవుతారు. ఇటీవల పాలకొల్లులో పర్యటించినపుడు క్షీరారామం ఆలయం పక్కన ఒక ప్రజాస్వామ్య ప్రియుడు పెద్ద ఫ్లెక్సీ ప్రదర్శించాడు. ‘ఐదువందల రూపాయల నోటు తీసుకుని ఓటేసే వారు ఒక్క విషయం ఆలోచించాలి. ఐదేళ్లు మీకు ప్రతినిధిగా ఉన్నందుకు వారు రోజుకు మీకు 27పైసల లంచం ఇస్తున్నారన్నమాట. ఈ రోజుల్లో బిచ్చగాడు కూడా 27పైసల బిచ్చాన్ని తీసుకోడు. మీరు తీసుకుంటారా..’ అని సవాలు విసిరాడు. రాజ్యాంగం లో పార్లమెంట్ సభ్యుడు కావడానికి రెండే రెండు అర్హతలను సూచించింది. 25ఏళ్ల వయసు, భారతపౌరసత్వం. కానీ మంచివాడెవరో నిర్ణయించే బాధ్యత ఓటరుది.    
 
 ఉద్యోగికి ఒక రూలు-నేతలకు మరో రూలా?
 నేరాలు చేసినట్టు రుజువైతే పోటీ చేయడానికి అనర్హత వస్తుంది. కానీ మన దేశంలో నేరాలు చేసినట్టు రుజువు కావడానికి చాలాకాలం పడుతుంది. ఎన్నికల కమిషన్ వారు ఒక ప్రతిపాదన చేశారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, లంచాల నేరాలు చేసినట్టు ఆరోపణలకు గురైన వారిని నిర్దోషి అని రుజువయ్యేదాకా పోటీచే యకుండా నిషేధించాలని కోరారు. ఈ నిషేధం విధిస్తే ప్రత్యర్థులు ఒక మహిళకు డబ్బు ఇచ్చి ఎవరైనా మహిళ ద్వారా తనను ఫలానా వ్యక్తి రేప్ చేశాడని అవాస్తవమైన ఆరోపణ చేసి పోటీచేయకుండా ఆపగలుగుతారు కదా.
 
 ఈ నిషేధానికి కేవలం ఫిర్యాదును, ఎఫ్‌ఐఆర్‌ను లేదా చార్జిషీట్‌ను మాత్రమే పరిగణించకూడదు. ఫిర్యాదు తర్వాత ప్రాథమిక పరిశీలన చేసి ఎఫ్‌ఐఆర్ రూపొందిస్తారు. తరువాత దర్యాప్తు చేసి ఫిర్యాదు నిజం అయ్యే అవకాశం ఉందని నమ్మి అందుకు తగిన సాక్ష్యాలు సేకరించిన తరువాత నేరారోపణ పత్రం చార్జిషీట్ తయారుచేస్తారు. ఈ విధంగా చార్జిషీట్ వేసిన తరువాత కూడా పోటీపై నిషేధం కూడదు. చార్జిషీటును, సాక్ష్యాలను కోర్టుకు పంపుతారు. న్యాయమూర్తి వీటిని లోతుగా పరిశీలించిన తర్వాత అభియోగాలు నమోదు చేస్తారు. అప్పటినుంచి పోటీకి నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఇది చాలా సమంజసమైన సూచన. కానీ రాజకీయ పార్టీలు దీన్ని అంగీకరించడం లేదు. ప్రభుత్యోద్యోగి ఏ నేరంలో జైలుకు వెళ్లినా సస్పెండ్ అవుతాడు. నేరం రుజువు కాగానే డిస్మిస్ చేస్తారు. మామూలు మనిషికి జైల్లో ఉంటే ఏ హక్కులూ ఉండవు. కానీ రాజకీయ నాయకుడైనంత మాత్రాన నేరాలు చేసినా పదవుల్లో కొనసాగే అర్హత ఇవ్వడం, అనర్హతలు అసలు అమలులోకి రాకుండా చూడడం చాలా అన్యాయం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement