చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు | Laws undermined governments | Sakshi
Sakshi News home page

చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు

Published Wed, Aug 24 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు

చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు

హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి
విజయవాడ (మొగల్రాజపురం) :
చట్టాలు అమలు చేయాల్సిప్రభుత్వం ఆ చట్టాలకుతూట్లు పొడిచి ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. బందరురోడ్డులోని ఆల్‌ ఇండియా రేడియో ఎదురుగా ఉన్న ౖవైట్‌హౌస్‌ బిల్డింగ్‌లో నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూమెంట్‌ (ఎన్‌ఏపీఎం), ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోషియేషన్‌ సంయుక్తంగా ‘ప్రజాహిత వ్యాజ్యాలు– న్యాయస్థానాల వైఖరి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటంలో ప్రజాప్రయోజనాల వాజ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఇదే మాదిరిగా వేసిన ‘ఫిల్స్‌’ వల్లనే బొగ్గు,  2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో  అవినీతి బహిర్గతమై వేల కోట్ల రుపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడగలిగారన్నారు. అమరావతిలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్న వైఖరి, రాజధాని నిర్మాణానికి ని«ధులు అంశాలపై సీనియర్‌ జర్నలిస్ట్‌ ఏబీకే ప్రసాద్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌ను కోర్టు  స్వీకరించపోవడం విడ్డూరంగా ఉందన్నారు.  2013 ల్యాండ్‌ ఎక్విజేషన్‌ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్‌లో ఆమోదించి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే దానిని కాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు ల్యాండ్‌ ఫూలింగ్‌ అంటూ కొత్త విధానాన్ని అమలు చేస్తుండటం అదేదో గొప్ప కార్యం మాదిరిగా మంత్రివర్గం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కుని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందని పిల్‌ వేస్తే విచారించకుండా మీకేం సంబంధం అంటూ ప్రశ్నించడం సరికాదన్నారు. పంట పొలాలను తీసుకోవద్దని మేధావులతో పాటుగా శివరామకృష్ణన్‌ కమిటీ కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల వాజ్యం వేసే వారు  50 వేల రుపాయలను డిపాజిట్‌ చేయాలంటూ విధించిన నిబంధన సరికాదన్నారు. పిల్‌ వేయడం వల్ల ప్రజాధనం వృద్ధా కాకుండా ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఈ నిబంధన వల్ల అవినీతి జరుగుతుందని పౌరులకు తెలిసినా పిల్‌ వేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు. సమావేశానికి  ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎన్‌ఏపీఎం రాష్ట్ర కన్వీనర్‌  బీఆర్‌కే రాజు, క్యాపిటల్‌ రీజియన్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మల్లెల శేషగిరిరావు,  రైతు, రైతు కూలీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ అనుమోలు గాంధీ,  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని«ధులు కొలనుకొండ శివాజి, ఎన్‌.నరసింహారావు, రాజకీయ  విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాసరావుతో పాటుగా కొంత మంది రైతులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
తీర్మానాలివే..
సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులు అమలు చేయాలని, తక్షణమే నవ్యాంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఫిల్‌ వేసే వారు రూ.50 వేలు చెల్లించాలని హైదరాబాద్‌ హైకోర్టు విధించిన నిబంధన తొలగించాలని, సుప్రీం, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులు రాజకీయ నాయకులకు వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇవ్వడం వలన ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇచ్చే ముందు ఒక సారి ఆలోచించాలని తీర్మానాలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement