యువ న్యాయవాదులకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శ్యామ్‌కోషి సూచన
సాక్షి, హైదరాబాద్: నిరంతర పఠనంతోనే చట్టాలపై అవగాహన పెంపొందుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ యువ న్యాయవాదులకు సూచించారు. మారుతున్న కాలానుగుణంగా చట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులకు జ్యుడీషియల్ అకాడమీ, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ పోలీస్ అకాడమీలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శ్యామ్ కోషి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయవాదుల కోసం అకాడమీ, బార్ కౌన్సిల్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అకాడమీని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శ్యామ్ కోషి ప్రశంసించారు. దాదాపు 400 మంది న్యాయవాదులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం.రాజేందర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకట్‌రామ్, బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment