లింగ నిర్ధారణ చట్టాలను పాటించాలి
Published Fri, Sep 2 2016 12:13 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
ఎంజీఎం : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలని, దీనిని అతిక్రమించి ఎవరు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు స్పష్టం చేశా రు. వరంగల్ రేడియాలజిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం డయాగ్నస్టిక్ సెంట ర్లను మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డీఎంహెచ్‌ఓ సాంబశివరావును కలిశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు రేడియాలజీ అసోసియేషన్ బాధ్యులు లింగనిర్ధారణ జరుపుతున్న కేంద్రాలను గుర్తించి నిర్వాహకులకు శిక్ష పడే లా సహకరించాలని కో రారు. డీఎంహెచ్‌ఓను కలిసిన వారిలో రేడియోలజిస్టుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, తాళ్ల రవి, నర్సింగరెడ్డి, సంతోష్ ఉన్నా రు.
వేధింపులు నిలిపివేయాలి
న్యూశాయంపేట : చిన్న చిన్న కారణాలను సా కుగా చూపి డయాగ్నస్టిక్ కేంద్రాలపై దాడులు చేయడం మానుకోవాలని ఇండియన్ రేడియాలజికల్ ఇమాజింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి.నర్సింగారెడ్డి కోరారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లరికల్ తప్పులను పెద్దవిగా చూపిస్తూ సెంటర్ల పై పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్ ప్రయోగించ డం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టì..రమేష్ మాట్లాడుతూ శుక్రవారం నుంచి అల్ట్రా సౌండ్ సేవలను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో డాక్టర్‌లు తాళ్ల రవి, కె.పవన్‌రెడ్డి, రమణారెడ్డి, మాధవీలత, మాధురి, స్వప్న, వనజ, పూర్ణచందర్, అఖిల్, వేణు, సంతోష్‌రెడ్డి, కపిల్, సునీల్, ఆఫ్రోజ్, దీప్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement