ఏజెన్సీలో చట్టాలు ఎవరికోసం?
Published Tue, Oct 18 2016 8:17 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
–ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు.
బుట్టాయగూడెం:
ఏజెన్సీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలు గిరిజనుల కోసమా.? లేక గిరిజనేతరుల కోసమా? అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆదివాసీలైన గిరిజనులు హక్కులను కాపాడేందుకు ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేస్తే అవి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల గిరిజనులు అనేక అవస్ధలు పడే పరిస్ధితి నెలకొందన్నారు. ఏజెన్సీలోని చట్టాలను తుంగలో తొక్కి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే గిరిజనులు ఎన్నో ఏళ్ళుగా సాగుచేసుకుంటున్న భూములను సైతం 1(బి)ల్లో మారిపోతున్నాయని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారన్నారు. 1/70 చట్టానికి విరుధ్ధంగా 1(బి)లో పేర్లు ఎలా మారిపోతున్నాయో అర్ధం కావడంలేదన్నారు. అలాగే భూసేకరణకు సంబంధించి లోపాలు తలెత్తినట్లు తమ దష్టికి వస్తున్నాయన్నారు. పక్కా రికార్డులు లేని భూములను భూసేకరణ చేస్తే దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని గిరిజన సంఘాలు గగ్గోలు పెడుతున్నా కొంతమంది వ్యక్తులు అధికారులను మభ్యపెట్టే ఫ్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement