
యువతే మన బలం: కోడెల
సీపీఏ సమావేశంలో ప్రసంగించటం అరుదైన గౌరవం
హైదరాబాద్: చట్టాలు చేయటం, ప్రభుత్వంలో భాగస్వాములను చేసేం దుకు యువతకు రాజకీయాల్లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలన్నారు. లేదంటే ప్రపంచ శాంతికి ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకూ కామెరూన్‌లో 60వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సమావేశాలు జరి గాయి. ప్రపంచంలోని 55కు పైగా దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవ్వగా ‘హౌ కెన్ పార్లమెంట్ ఎన్‌స్యూర్ దట్ యంగ్ పీపు ల్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్: ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై శివప్రసాదరావు ప్రసంగించారు.
అనంతరం మారిషస్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించి స్థానిక ప్రజల జీవనస్థితిగతులను పరిశీలించారు. పర్యటన ముగిం చుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన శుక్రవారం అసెంబ్లీ కమిటీలో హాలులో విలేకరులతో మాట్లాడారు. తన పర్యటన అనుభవాలు, సీపీఏ సమావేశం జరిగిన తీరును ఇన్‌ఛార్జి కార్యదర్శి సత్యనారాయణతో కలిసి వెల్లడించారు. సీపీఏ సమావేశాల్లో పాల్గొనటం మంచి అవకాశమని కోడెల తెలి పారు. అక్కడ దేశ, రాష్ట్ర కీర్తి పతకాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు.