పోలవరం ప్రాజెక్టును నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని అధికారంలోకి రాకముందు బంద్‌కు పిలుపునివ్వడ మే కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న పార్టీ..
హన్మకొండ చౌరస్తా : పోలవరం ప్రాజెక్టును నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని అధికారంలోకి రాకముందు బంద్‌కు పిలుపునివ్వడ మే కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న పార్టీ.. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ అంశాన్ని పక్కనపెట్టడం అప్రజాస్వామికమని సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్‌డ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. అప్పట్లో బంద్‌కు ప్రజ లు పూర్తి మద్దతు తెలిపినా వారి ఆకాంక్షను నెరవేర్చేలా రాష్ర్టప్రభుత్వం పోలవరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడం సరికాదని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఆయన విమర్శిం చారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానం లో ఆదివారం జరిగింది. అంతకుముందు సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి టీపీఎఫ్ నాయకులు కళాకారు లతో ర్యాలీగా మైదానానికి చేరుకున్నారు. అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సం దర్భంగా టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు బి.రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో హరగోపాల్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
ఒడిశా అసెంబ్లీలో పార్టీలకతీతంగా పోలవరాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించారు.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మావోయిస్టులు సైతం పోలవరాన్ని వ్యతిరేకించారు... కానీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గి కేంద్రాని కి తలొగ్గిందని ప్రశ్నించారు. గిరిజనులను నట్టే ట ముంచే పోలవరంతో ఆంధ్ర మత్స్యకారులకు కూడా ప్రమాదమేనన్నారు. కాగా, వరంగల్ ప్రజల్లో తాను పాఠాలు చెప్పినప్పటి చైతన్యం ఇప్పుడు లేదని. ఆ చైతన్యం అవసరమని హరగోపాల్ వ్యాఖ్యానించారు.
ఎవరు ఇస్తే తీసుకోలేదు..
అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందే తప్ప ఎవరో ఇస్తే తీసుకోలేదని టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎం దరో అమరవీరుల త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికి కూడా హైదరాబాద్‌లోని విలువైన భూములను రాయలసీమ, ఆంధ్రా నాయకులు కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు, నిరుద్యోగులకు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.
ఇది పోను సీమాంధ్ర సినీ మాఫియాకు మాత్రం ఐ దు ఎకరాలు ఇస్తానని చెప్పడమేమిటని ప్రశ్నిం చారు. గవర్నర్ నరసింహన్ పీఎం నరేంద్రమోడీకి అనుకూలంగా ఉండడమే కాకుండా.. చంద్రబాబు, కేసీఆర్ నడుమ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వారి ద్దరు కలిసి హైదరాబాద్‌ను దోచుకునేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. కాగా, పోలవ రం ప్రాజెక్టును రద్దు చేసే వరకు టీపీఎఫ్ పోరాడుతుందని మద్దిలేటి స్పష్టం చేశారు.
ఇక టీఎన్జీఓ నాయకులు కూడా ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం పాకులాడడం సరికాదని పే ర్కొన్నారు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని చూ డాలన్న తన కల నెరవేరినందున, పోలవరం ను రద్దు చేసేందుకు నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఆజంజాహి మి ల్లు మూతపడడానికి పురుషోత్తంరావు, గండ్ర వెంకటరమణారెడ్డిలే కారణమని ఆరోపించా రు. సభలో ప్రొఫెసర్ ఈసం నారాయణ, అన్వర్‌ఖాన్, నలమాస కృష్ణ, నర్సింహరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.