బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ
బెంగళూరు: బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల విషయమై న్యాయవాది జోసెఫ్ అరిస్టాటిల్ వాదించనున్నారన్నారు.
ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని యడ్యూరప్పపై ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయచంద్ర తెలిపారు.