బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నమోదైన ఎన్నికల నియమాళి ఉల్లంఘన కేసు గుజరాత్ నుంచి బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విన్నవించింది.
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నమోదైన ఎన్నికల నియమాళి ఉల్లంఘన కేసు గుజరాత్ నుంచి బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విన్నవించింది. గుజరాత్ పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
గత నెల 30న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు మోడీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని ఏఐసీసీ న్యాయవిభాగం కార్యదర్శి కేసీ మిట్టల్ ఆరోపించారు.