‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’ | Tell the progress of the investigation on the black money | Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’

Published Wed, Apr 22 2015 1:03 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’ - Sakshi

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’

న్యూఢిల్లీ: నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.

వచ్చేనెల 12కల్లా నివేదిక సమర్పిస్తే వేసవి సెలవులకు ముందు ఈ అంశాన్ని పరిశీలించే వీలుంటుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీకి ధర్మాసనం సూచించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement