‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’
న్యూఢిల్లీ: నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.
వచ్చేనెల 12కల్లా నివేదిక సమర్పిస్తే వేసవి సెలవులకు ముందు ఈ అంశాన్ని పరిశీలించే వీలుంటుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీకి ధర్మాసనం సూచించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.