
పునఃపంపకంతోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాలను పూర్తిగా సమీక్షించాలి
పరీవాహకం ఆధారంగా దక్కాల్సిన వాటా దక్కలేదు
సుప్రీంలో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు
కేసులో వాదనలకోసం సుప్రీం న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారుల సమావేశం
మిగులు జలాల పంపిణీలో అన్యాయాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయం
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి పూర్తిగా సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేసేలా సుప్రీం కోర్టును అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న పరివాహకం ఆధారంగా రాష్ట్రాని కి రావాల్సిన న్యాయమైన వాటా దక్కని దృష్ట్యా కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలని నిశ్చయించింది. కృష్ణా జలాల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయతీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లో నూ నాలుగు రాష్ట్రాలు న్యాయమైన వాటాకు భాగస్వాములు అవుతాయనే విషయాన్ని సుప్రీం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రం సిద్ధవువుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కృష్ణా పరి వాహక ప్రాంతం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నా, కేటాయింపులు మాత్రం ఆంధ్రాకు వెళ్లాయని.., మిగులు జలాల వాడకంలో గతంలో జరిగిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ విస్మరించిందనే విషయాలన్నింటిపై గట్టిగా వాదనలు చేసేలా కసరత్తు చేపట్టింది.
కృష్ణా జల వివాదాలపై ఏర్పాై టెన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగనణలోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీని పై ఆగస్టులోనే విచారించిన సుప్రీం, రాష్ట్ర అభ్యర్థనకు సమ్మతిస్తూనే, నాలుగు రాష్ట్రాల నుంచి కౌం టర్ దాఖలుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వైద్యనాధన్ ఆదివారం రాష్ట్రానికి చెందిన అంతర్‌రాష్ట్ర నదీ నిర్వహణ బోర్డు అధికారులు, రాష్ట్ర న్యాయవాదులతో సమావేశమయ్యారు. సుప్రీంలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా నది జలాల కేటాయింపులు రాష్ట్ర ప్రాజెక్టులకు ఏ రీతిన ఉన్నది సేకరించి నివేదికల రూపంలో సిద్ధపరిచారు.
పరివాహకం మనది.. కేటాయింపులు వారికి..
ఈ సవూవేశం సందర్భంగా నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేం దుకు అనుమతించడం వంటి కారణాలతో రా ష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతోందని అధికారులు న్యాయనిపుణుల దృష్టికి తెచ్చారు. నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47ఏళ్ల సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సైతం రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ చేశారని అధికారులు న్యాయునిపుణులకు వివరించా రు. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని చెప్పారు. మిగులు జలాలను సైతం 150 టీఎంసీల మేర ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే తెలంగాణకు కేవలం 77 టీఎంసీల మేర మాత్రమే కేటాయింపులు జరగాయని వివరిం చారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్‌ల ముందు ఇదివరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు లేదని, ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడిన దృష్ట్యా తవు వాదనలు వినిపిం చేందుకు అవకాశం కల్పించేలా సుప్రీంని కోరాలని అధికారులు న్యాయునిపుణులకు తెలిపారు.
అన్నింటా ఉల్లంఘనలే!
ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని వివరించారు. గత ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరుపాల్సి ఉన్నా, ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించి న విషయాన్ని గట్టిగా చెప్పాలన్నారు. తుంగ భద్ర కెనాల్‌నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 19 టీఎం సీల నీరు రావాల్సి ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరుగని విషయాన్ని అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు.
4 రాష్ట్రాలకు కేటాయింపులు కోరాలి!
కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలపై ఏపీ సర్కారు వ్యూహం ఖరారు
హైదరాబాద్: దిగువ రాష్ట్రమైన ఏపీకి మిగులు జలాల మీద పూర్తి హక్కు కోరాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పులో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దుకొనే దిశగా వాదనలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను రెండేళ్ల పాటు కొనసాగించిన విషయం విదితమే. విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికే పరిమితం కా కుండా.. పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. కృష్ణా బేసిన్‌లో నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయిం పులు జరపాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆదివారం ఖరారు చేసింది. ట్రిబ్యునల్ ముందు వాదించడానికి ప్రభుత్వం నియమించిన న్యాయవాది గంగూలీ ఆదివారం హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పు వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని, మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రా లు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర)కు పంపిణీ ఫలితంగా.. దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన మిగులు జలాలపై పూర్తి హక్కు కోల్పోవాల్సి వస్తోం దని, ఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులకే ట్రిబ్యునల్ పరిమితమైతే.. గతంలో జరిగిన అన్యాయాన్ని కొనసాగించినట్లువుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమయింది. గత తీర్పులో జరిగిన అన్యాయాన్ని సవరించడంతో పాటు దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై పూర్తి హక్కు కోరడానికి వీలుగా నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే విధంగా పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని కోరితే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయవాదికి అధికారులు సూచించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయాలని కూడా నిర్ణయించారు.