Brijeskumar Tribunal
-
‘కృష్ణా’ తీర్పుపై ఏంచేద్దాం!
టీఏసీతో జల వనరుల విభాగం సమాలోచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం గురువారం సాంకేతిక సలహా సంఘం (టీఏసీ)తో సమాలోచనలు జరిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఫలితం ఉంటుం దా? ఉండదా? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చిం చింది. అయితే సుప్రీంకు వెళ్లే విషయమై భిన్నాభిప్రాయాలు రావ డం, ఇది పూర్తిగా న్యాయపరమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో సీనియర్ న్యాయవాదులతో చర్చించి తుది నిర్ణయానికి రావడమే ఉత్తమమని సలహా సంఘం సూచించినట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం, ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి టీఏసీ సభ్యులు గోపాల్‌రెడ్డి, రవూఫ్, కె.వేణుగోపాల్‌రావు, న్యాయవాదులు రవీందర్రావు, విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌కు అదనంగా మరో పిటిషన్ వేయాలని, ట్రిబ్యునల్ తీర్పుపై స్టే కోరాలని కొందరు సూచించగా, తీర్పు వెలువడ్డాక కోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని మరికొందరు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. కాగా, ఈ నెల 29న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో నిర్వహించే సమావేశంలోనే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తూ సమావేశాన్ని ముగించినట్లుగా తెలిసింది. -
భవిష్యత్ ఎడారే!
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తీవ్రంగా నష్టపోనున్న రైతులు ప్రాజెక్టుల భవితవ్యంపై నీలినీడలు ప్రభుత్వ చేతగానితనమే కారణమంటున్న రైతు సంఘాలు కృష్ణా మిగులు జలాలను (మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్) నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలని బ్రిజేష్‌కుమార్ తీర్పునివ్వడంతో జిల్లా రైతుల్లో ఆందోళన మొదలైంది. మిగులు జలాలపై ఉన్న పూర్తి హక్కుతో చేపట్టిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో వీటి ద్వారా సుమారు 2,43,500 ఎకరాలు సాగులోకి రానున్నాయి. దీంతో పాటు సుమారు 5 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించే బృహత్తర ప్రాజెక్టులకు నీరు కరువయ్యే పరిస్థితి దాపురించింది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కృష్ణా నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని స్వయంగా బ్రిజేష్‌కుమార్ చెప్పడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాక్షి, చిత్తూరు: కరువు జిల్లా అయిన చిత్తూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వాలు గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులు చేపట్టాయి. కృష్ణా నదిలోని మిగులు జలాలపైనే ఆధారపడి ఈ ప్రాజెక్టులను చేపట్టారు. జిల్లాలో గాలేరు– నగరి ద్వారా దాదాపు 1.03 లక్షల ఎకరాలు, హంద్రీ–నీవా ద్వారా సుమారు 1.40 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. నీటి కేటాయింపుల్లో కూడా జిల్లాకు చెందిన ప్రాజెక్టుల్లో కేవలం తెలుగుగంగకు మాత్రమే 25 టీఎంసీలు కే టాయించారు. గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను అసలు పరిగణలోకి తీసుకోలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయం అమలైతే జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. అంతేకాకుండా ఫ్లోరైడ్ నీరు తాగుతున్న పశ్చిమ మండలాలకు స్వచ్ఛమైన తాగు నీరు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యమే.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. తమ మిత్ర పక్షమైన బీజేపీతో కనీసం ప్రజల ప్రయోజనాల కోసం కూడా గట్టిగా నిలదీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కూడా సరైన వాదనలు వినిపించడంలో విఫలమైనందునే ఇలాంటి పరిస్థితి దాపురించిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. సొంత జిల్లాకు కూడా సీఎం చంద్రబాబు న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. రూ.వేల కోట్లు వృథాయేనా? ట్రిబ్యునల్ తీర్పుతో ఈ రెండు ప్రాజెక్టులపై పెట్టిన సుమారు రూ.7 వేల కోట్లు వృథా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుచూపు కొరవడటం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నం అయింది. బ్రిజేష్ కుమార్ తీర్పు రాకముందే ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే ఈ ప్రాజెక్టులకూ నీటి కేటాయింపులు జరిగేవి. అయితే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. అనంతరం వైఎస్సార్ హయాంలో శరవేగంతో దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణం తరువాత ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. దీంతో బ్రిజేష్ కమిటీ ఈ ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
బ్రిజేశ్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి
పొంగులేటి సుధాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్రిజేశ్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమన్నారు. ఈ తీర్పు వల్ల ప్రజలు నష్టపోతారని, ఇది నాయకుల స్వంత వ్యవహారం కాదన్నారు. ఈ తీర్పును అసెంబ్లీలో ప్రధాన అంశంగా తీసుకుని చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ తనకోసం చేయించుకున్న సర్వేలు స్వంతడబ్బా కొట్టుకోవడానికేనన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎగువ రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని పొంగులేటి సూచించారు. -
ట్రిబ్యునల్ తీర్పు.. కొత్త సచివాలయం
♦ నేటి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ ♦ ట్రిబ్యునల్ తీర్పుపై నీటిపారుదల అధికారులతో హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.. కొత్త సచివాలయం నిర్మాణం.. ఈ రెండు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మొత్తం పది అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు వెలువడినందున ఇప్పటికిప్పుడు సుప్రీంకి వెళ్లినా ఇంతకు మించి చేసేదేమీ ఉండదనే వాదనను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి న్యాయం చేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదని, ఈ కేసులో ఏపీని కలుపుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయించిన 254 టీఎంసీలను ఆ రాష్ట్రాలు వాడుకుంటే దిగువకు నీరొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఖరీఫ్ ఆశలు పూర్తిగా వదులుకోవడమో లేక అక్టోబర్ వరకు ఆగడమో చేయాల్సిందేనని, ఇది రాష్ట్రానికి గొడ్డలిపెట్టేనని అంటున్నారు. రెండు రాష్ట్రాలకే ఈ వాదనలు పరిమితమైతే తెలంగాణ కేవలం క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అందులో వచ్చే వాటాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకు ఈ వాటాలు ఎంతమాత్రం సరిపోవు. అందుకే సుప్రీంను ఆశ్రయించి స్టే కోరాలనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు గురువారం సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కేంద్ర ప్రభుత్వ పాత్ర, తదుపరి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు, సుప్రీంలో ఇప్పటికే దాఖలై ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ల పురోగతిని సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసి ఆ వివరాలన్నింటినీ అందించారు. వచ్చే నెలలోనే కూల్చివేత..! ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి.. అదే ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో ఉన్న తమ సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ విభజనకు సంబంధించిన అంశం కావటంతో ఏపీ సచివాలయం స్వాధీనం, మొత్తం సచివాలయంలోని అన్ని భవనాల కూల్చివేతపై మంత్రివర్గంలో చర్చించి తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అందుకు వీలుగా సచివాలయంలోని ఆఫీసులన్నీ తాత్కాలికంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఆఫీసులను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని, ఏపీ ప్రభుత్వానికి నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్‌ను అప్పగించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో గురువారం సీఎస్ ఈ రెండు భవనాలను పరిశీలించారు. -
పునఃపంపకంతోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాలను పూర్తిగా సమీక్షించాలి పరీవాహకం ఆధారంగా దక్కాల్సిన వాటా దక్కలేదు సుప్రీంలో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు కేసులో వాదనలకోసం సుప్రీం న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారుల సమావేశం మిగులు జలాల పంపిణీలో అన్యాయాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయం హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి పూర్తిగా సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేసేలా సుప్రీం కోర్టును అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న పరివాహకం ఆధారంగా రాష్ట్రాని కి రావాల్సిన న్యాయమైన వాటా దక్కని దృష్ట్యా కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలని నిశ్చయించింది. కృష్ణా జలాల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయతీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లో నూ నాలుగు రాష్ట్రాలు న్యాయమైన వాటాకు భాగస్వాములు అవుతాయనే విషయాన్ని సుప్రీం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రం సిద్ధవువుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కృష్ణా పరి వాహక ప్రాంతం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నా, కేటాయింపులు మాత్రం ఆంధ్రాకు వెళ్లాయని.., మిగులు జలాల వాడకంలో గతంలో జరిగిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ విస్మరించిందనే విషయాలన్నింటిపై గట్టిగా వాదనలు చేసేలా కసరత్తు చేపట్టింది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాై టెన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగనణలోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీని పై ఆగస్టులోనే విచారించిన సుప్రీం, రాష్ట్ర అభ్యర్థనకు సమ్మతిస్తూనే, నాలుగు రాష్ట్రాల నుంచి కౌం టర్ దాఖలుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వైద్యనాధన్ ఆదివారం రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర నదీ నిర్వహణ బోర్డు అధికారులు, రాష్ట్ర న్యాయవాదులతో సమావేశమయ్యారు. సుప్రీంలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా నది జలాల కేటాయింపులు రాష్ట్ర ప్రాజెక్టులకు ఏ రీతిన ఉన్నది సేకరించి నివేదికల రూపంలో సిద్ధపరిచారు. పరివాహకం మనది.. కేటాయింపులు వారికి.. ఈ సవూవేశం సందర్భంగా నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేం దుకు అనుమతించడం వంటి కారణాలతో రా ష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతోందని అధికారులు న్యాయనిపుణుల దృష్టికి తెచ్చారు. నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47ఏళ్ల సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సైతం రాష్ట్రానికి శరాఘాతంగా మారిందని వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ చేశారని అధికారులు న్యాయునిపుణులకు వివరించా రు. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని చెప్పారు. మిగులు జలాలను సైతం 150 టీఎంసీల మేర ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే తెలంగాణకు కేవలం 77 టీఎంసీల మేర మాత్రమే కేటాయింపులు జరగాయని వివరిం చారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ల ముందు ఇదివరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు లేదని, ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడిన దృష్ట్యా తవు వాదనలు వినిపిం చేందుకు అవకాశం కల్పించేలా సుప్రీంని కోరాలని అధికారులు న్యాయునిపుణులకు తెలిపారు. అన్నింటా ఉల్లంఘనలే! ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని వివరించారు. గత ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరుపాల్సి ఉన్నా, ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించి న విషయాన్ని గట్టిగా చెప్పాలన్నారు. తుంగ భద్ర కెనాల్‌నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 19 టీఎం సీల నీరు రావాల్సి ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరుగని విషయాన్ని అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. 4 రాష్ట్రాలకు కేటాయింపులు కోరాలి! కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలపై ఏపీ సర్కారు వ్యూహం ఖరారు హైదరాబాద్: దిగువ రాష్ట్రమైన ఏపీకి మిగులు జలాల మీద పూర్తి హక్కు కోరాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పులో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దుకొనే దిశగా వాదనలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను రెండేళ్ల పాటు కొనసాగించిన విషయం విదితమే. విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికే పరిమితం కా కుండా.. పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. కృష్ణా బేసిన్లో నాలుగు రాష్ట్రాలకు తాజాగా నీటి కేటాయిం పులు జరపాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆదివారం ఖరారు చేసింది. ట్రిబ్యునల్ ముందు వాదించడానికి ప్రభుత్వం నియమించిన న్యాయవాది గంగూలీ ఆదివారం హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత తీర్పు వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని, మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రా లు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర)కు పంపిణీ ఫలితంగా.. దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన మిగులు జలాలపై పూర్తి హక్కు కోల్పోవాల్సి వస్తోం దని, ఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులకే ట్రిబ్యునల్ పరిమితమైతే.. గతంలో జరిగిన అన్యాయాన్ని కొనసాగించినట్లువుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమయింది. గత తీర్పులో జరిగిన అన్యాయాన్ని సవరించడంతో పాటు దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై పూర్తి హక్కు కోరడానికి వీలుగా నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే విధంగా పూర్తిస్థాయి ట్రిబ్యునల్‌గా పనిచేయాలని కోరితే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయవాదికి అధికారులు సూచించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయాలని కూడా నిర్ణయించారు.