‘వేలూరు కోట’పై కోర్టుకు వెళ్తాం: ఒవైసీ
వేలూరు (తమిళనాడు): వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. వేలూరులో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కోటలో ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ముస్లింలకు 7 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో పోటీ చేసి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.