హైదరాబాద్: 2011లో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏపీతో సంబంధం లేకుండా విడిగా మెయిన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రిలిమ్స్‌లో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులను మళ్లీ మెయిన్స్‌కు ఎంపిక చేసి పరీక్షను నిర్వహించడమా లేక ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త పరీక్షకు వెళ్లాలా అని సర్కారు యోచి స్తోంది. 2011లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో 6 తప్పులు దొర్లడంతో తాము మెయిన్స్‌కు అర్హత పొందలేకపోయామని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది కోర్టు ఆదేశించింది.
2011 గ్రూప్-1కు సొంత ఏర్పాట్లు
Published Wed, May 6 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement