ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ రాజారత్నం పేర్కొన్నారు. మంగళవారం ఆర్టీవో కార్యాలయంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని తెలిపారు.
టీఎస్ సిరీస్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితోపాటు పాత వాహనదారులూ వీటిని అమర్చుకోవాలని సూచించారు. నాలుగు నెలల్లో వీటిని అమర్చుకోకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు ఆర్టీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నంబర్ ప్లేట్లను క్రోమియోనిక్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినట్లు వివరించారు. వీటి తయారీని లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
నంబర్ ప్లేట్ల కోసం ద్విచక్రవాహనాలకు రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ. 282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున రుసుం తీసుకుంటామన్నారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలు చోరీకి గురైనప్పుడు దొంగలు వాటిని మార్చే వీలుండదని, దీని ద్వారా త్వరగా పట్టుకునే వీలుంటుందన్నారు. అదేవిధంగా ఆర్టీవో కార్యాలయంలో రూ.42 వేలతో ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రిజిస్ట్రేషన్‌ల కోసం దళారులను ఆశ్రయించొద్దని, నేరుగా కార్యాలయంలోనే సంప్రదించాలన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులపై చర్యలు చేపడుతామని, ఫిట్‌నెస్ లేని బస్సులు నడుపకూడదని సూచించారు.
ఇక హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
Published Wed, Nov 19 2014 3:24 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement