శాతవాహన యూనివర్సిటీ : ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
శాతవాహన యూనివర్సిటీ : ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు అందారుు. దీంతో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బి.మధుసూదన్‌రెడ్డి, కోఆర్డినేటర్ నితిన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గతంలో అనుమతి నిరాకరించిన 174 కళాశాలల్లో మాత్రమే విద్యార్థులు వారి సీట్లు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కౌన్సెలింగ్‌కు హాజరైనవారు, హాజరుకాని వారందరూ కౌన్సెలింగ్ అర్హులే. అరుుతే అభ్యర్థులు వారి వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటేనే హాజరుకావాలి. గతంలో కౌన్సెలింగ్‌కు వచ్చి ప్రొసెసింగ్ ఫీజు కట్టినా.. మళ్లీ విధిగా రుసుం చెల్లించాల్సిందే.
తీసుకురావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
ఎంసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్ మార్కుల జాబితా, టీసీ, ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, ఆదాయం, కులధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి.