ధోనికి ఊరట | Dhoni's relief | Sakshi
Sakshi News home page

ధోనికి ఊరట

Published Mon, Sep 14 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

ధోనికి ఊరట

ధోనికి ఊరట

న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనను విష్ణుమూర్తిగా చూపిస్తూ ఓ బిజినెస్ మేగజైన్ ముఖచిత్రం ప్రచురించడంతో ధోనిపై బెంగళూరు ట్రయల్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ ధోని సుప్రీం కెళ్లాడు.

ఇప్పుడు తాజాగా ఆ కేసు విచారణపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఆర్‌కే అగర్వాల్‌లతో కూడిన బెంచ్ స్టే విధిం చింది. విచారణ కొనసాగించాల్సిందేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది. అంతేకాకుండా ధోనిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త జయకుమార్‌కు నోటీసులు పంపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement