Business Magazine
-
‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
న్యూయార్క్: అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు స్థానం దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్(ర్యాంకు 89), హెచ్‌సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) ఈ జాబితాలో చోటు సాధించారు. -
ధోనికి ఊరట
న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనను విష్ణుమూర్తిగా చూపిస్తూ ఓ బిజినెస్ మేగజైన్ ముఖచిత్రం ప్రచురించడంతో ధోనిపై బెంగళూరు ట్రయల్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ ధోని సుప్రీం కెళ్లాడు. ఇప్పుడు తాజాగా ఆ కేసు విచారణపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఆర్కే అగర్వాల్‌లతో కూడిన బెంచ్ స్టే విధిం చింది. విచారణ కొనసాగించాల్సిందేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది. అంతేకాకుండా ధోనిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త జయకుమార్‌కు నోటీసులు పంపింది.