సుప్రీంను కోరిన కేంద్రం శుక్రవారం నిర్ణయం చెబుతామన్న సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ అనుసంధానాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ‘పిటిషన్ విచారణకు తొమ్మిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ అవసరం. అంతమందిని ఇస్తే మిగతాపనులు ఏమవ్వాలి.
అందుకే రేపు సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి’ అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు చెప్పారు. కేవలం పీడీఎస్, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ స్వచ్ఛంద వినియోగానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును మార్చాలని రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, హరీశ్ సాల్వే కూడా మద్దతు తెలిపారు. ఉపాధి హామీ, జన్‌ధన్ యోజన లాంటి పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రాముఖ్యతను గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించిన రోహత్గీ.. పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఆధార్‌పై నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి
Published Fri, Oct 9 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM
Advertisement
Advertisement