మలి విడత కౌన్సెలింగ్‌పై.. ‘సుప్రీం’కు విద్యార్థులు అనుమతించాలని కోరుతూ
నేడు పిటిషన్ దాఖలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి న విద్యార్థులు, కొన్ని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు వేర్వేరుగా సోమవారం సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేయనున్నారు. మలివిడత కౌన్సెలింగ్‌కు అనుమతించి తమను ఆదుకోవాలని వారు కోర్టుకు విన్నవించాలని నిర్ణయించారు.
కాగా, ఇదే విషయమై ఏపీ ఉన్నత విద్యామండలి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం ఆదే శాలతో తాము నష్టపోతామని చెబుతున్న వేలాది మంది విద్యార్థులు తిరిగి అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. అదేవిధంగా మలి విడత కౌన్సెలింగ్ జరగని పక్షంలో తమ కళాశాలలను మూసివేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి.