వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం జాతీయ వైద్యమండలి ప్రతిపాదించిన నీట్ పరీక్షపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది.
వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం జాతీయ వైద్యమండలి ప్రతిపాదించిన నీట్ పరీక్షపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. మార్చి 31 నాటికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘానికి నిర్ధేశించింది. తదుపరి నాలుగు రోజుల్లో ప్రతిస్పందనలు ఇవ్వాలని జాతీయ వైద్య మండలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.