National Medical Council
-
కొత్త మెడికల్ కాలేజీలకు నో
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఝలక్ ఇచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేఖ (లెటర్ ఆఫ్ పర్మిషన్ – ఎల్వోపీ) ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మెయిల్ పంపించింది. మౌలిక సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగాలేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో వైద్య కళాశాలల కోసం గతేడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడం (జీరో ఫ్యాకల్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల, ఇన్‌పేషెంట్లు విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ, ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్ర కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి. కానీ వాళ్లు లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కాగా ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. లేనిపక్షంలో అనుమతులివ్వదు. కాగా ఈ విషయంపై డీఎంఈ డాక్టర్ వాణి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లెటర్ల కోసం ఎదురుచూస్తున్నామని, అవి అందిన తర్వాత అప్పీలుకు వెళ్తామని తెలిపారు. బోధనా సిబ్బంది లేరు.. వసతుల్లేవు రాష్ట్రంలో 29 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 3,790 సీట్లు ఉండగా ఎక్కువ కాలేజీల్లో 150 చొప్పున మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఔట్ పేషెంట్లు రాకపోవడంతో పీజీ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు. కొందరు పీజీ మెడికల్ కోసం కోచింగ్‌లకు వెళ్తున్నారు. ఏదో పరీక్ష పాసైతే చాలన్న అభిప్రాయం అటు విద్యార్థులు, ఇటు కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొందనే విమర్శలు విని్పస్తున్నాయి. వాస్తవానికి వసతులు లేవని విద్యార్థులు కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్పినా, నిరసన వ్యక్తం చేసినా ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోంది. గతంలోనే ఎన్ఎంసీ గరం ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంటోందని ఎన్ఎంసీ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉందని ఎన్ఎంసీ గతంలోనే తేల్చడం గమనార్హం. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్పేòÙంట్లు ఉండాలి. కానీ ఒక చాలా కాలేజీల్లో సగం మేరకు కూడా ఔట్ పేషెంట్లు రావడంలేదు. ఇది వైద్య శిక్షణకు ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 600 పడకలు అవసరం కాగా, చాలాచోట్ల 500–550తోనే నడిపిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 10 శాతం వరకే ఉంటోంది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు అవసరమైన సంఖ్యలో లేవు. మెడికల్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా 450 మందికి సరిపోయేలా హాస్టల్ వసతి ఉండాల్సి ఉండగా, 150 మంది బాలికలు, 190 మంది బాలురకు సంబంధించిన హాస్టల్ వసతి మాత్రమే ఉంది. కొన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల శిక్షణ కోసం అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలు కూడా లేకపోవడం గమనార్హం. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కనీసం చర్చించని బాబు సర్కారు.. గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిన ఎన్ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది. అనుమతులు వస్తే 500 సీట్లు..ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది. -
ఎన్ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని, వాటిని సడలించి పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద వైద్య సీట్ల చొప్పునే అనుమతిచ్చేలా నిబంధనలు రూపొందించింది. అలాగే కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతివ్వాలంటే 605 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి కూడా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర విభజన తర్వాత టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 12 కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయి. కానీ కొత్త నిబంధనల వల్ల ఏపీకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉండదు’ అని కేంద్ర మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు విడదల రజిని వివరించారు. వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తున్న సంస్కరణలకు కేంద్రం తరఫున తగిన సహకారం అందించాలని.. ఏపీ ప్రజలకు ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. తమ వినతికి మన్సూక్ మాండవీయ సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్‌దాస్, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘నెక్స్ట్’పై వెబినార్
సాక్షి, అమరావతి: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్)పై మంగళవారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెబినార్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఈ వెబినార్‌లో పాల్గొనాలని ఇప్పటికే ఎన్ఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఎంబీబీఎస్ పాసైనవారు ఉన్నత విద్య, ప్రాక్టీస్, రిజిస్టేషన్ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న వేర్వేరు విధానాలన్నింటినీ తొలగించి నెక్స్ట్ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఎన్ఎంసీ భావిస్తోంది. ఈ క్రమంలో నెక్స్ట్ గురించి విద్యార్థులు, అధ్యాపకులకు ఈ వెబినార్‌లో ఎన్ఎంసీ చైర్మన్ సురేశ్ చంద్ర శర్మ వివరిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వెబినార్ కోసం లెక్చర్ హాల్స్‌లో ప్రిన్సిపాల్స్ ఏర్పాట్లుచేశారు. -
Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది. సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
మచిలీపట్నం వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), మెడికల్ అసెస్మెంట్ మరియు రేటింగ్ బోర్డు అనుమతులిచ్చింది. ఈ మేరకు గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారికి ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్‌కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు. రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరోవైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు సమకూరనున్నాయి. ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్న సీఎం జగన్‌కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగాల్లో మరో మైలురాయి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు లభించినట్లు మంగళవారం ఆమె వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ బృందం.. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించింది. ఆ టైంలో.. అక్కడి నిర్మాణాలు, బోధనా, బోధనేతర సిబ్బంది, వసతులు, ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టళ్లు, ఆస్పత్రి, బోధనా సిబ్బంది అనుభవం, వారి పబ్లికేషన్లు, అందుబాటులో ఉన్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది.. ఇలా అన్నిఅంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెంది.. ఈ ఏడాది నుంచే తరగుతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు ప్రభుత్వానికి అందినట్లు ఆమె తెలిపారు. విజయనగరం మెడికల్ కళాశాలకు మొత్తం 150 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసిందన్నారామె. ఇక.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని పేర్కొన్నారు. అందులో భాగంగానే.. విజయనగరంలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు అనుమతులు లభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.8,500 కోట్లతో.. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని జగనన్న చేపట్టారని, ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం కళాశాలకు తొలి అనుమతులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. మరో నాలుగు కళాశాలలకు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చుతున్నామన్నారు. ఇందుకోసం అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరయ్యేలా సిబ్బంది నియామకాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, వైద్య పరికరాల కొనుగోలు... ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే.. పీజీ సీట్లను రాష్ట్రంలో గణనీయంగా పెంచుకునే విషయంలోనూ సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249 కు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామని వివరించారామె. -
విజయనగరం: ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. చదవండి AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం -
ఉక్రెయిన్ టూ భారత్: వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం
ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విదేశాలు స్వదేశాలకు తిరుగుపయనమైన విషయం తెలిసిందే. కాగా, భారత్‌కు చెందిన మెడిసిస్ విద్యార్థులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. అయితే, వారు మళ్లీ ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేదు. మరోవైపు.. ఇక్కడ మెడికల్ కాలేజీల్లో, యూనివర్సిట్లీలో ప్రవేశాలు కల్పించాలని నిరసనలు తెలుపుతున్నారు. అటు విద్యార్థుల పేరెంట్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్లారమెంట్స్ సెషన్స్‌లో భాగంగా ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం.. శనివారం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. లోకల్ కాలేజీల్లో అడ్మిషన్లపై ఎన్ఎంసీ(National Medical Commission) ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు బదిలీ చేయడానికి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి ఎన్ఎంసీ నిబంధనలు అంగీకరించవని తెలిపారు. దీంతో, విద్యార్థులకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. స్వదేశమైన భారత్‌లోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. 'No provision' to absorb Ukraine Medical returnees #MBBSCourse #MBBSstudent #MedicalStudent #NationalMedicalCommission #NMC #Ukrainemedicalstudenthttps://t.co/E0vEMxp0fn — The Health Master (@DHealthMaster) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
సీట్లు పెంచితేనే సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల రద్దు అంశం జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) పరిధిలో ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీలు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఎన్ఎంసీ నిర్ణయం వెలువడే వరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరింది. రద్దు చేసిన సీట్లకు ప్రత్యామ్నాయంగా ఎన్ఎంసీ సీట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. అనంతరం ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. టీఆర్ఆర్, ఎంఎన్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్ సీట్లను, 100 పీజీ సీట్లను జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎంఎన్సీ) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో తమ ప్రవేశాలను రద్దు చేసిన ఎన్ఎంసీ ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేదంటూ పీజీ మెడికల్ విద్యార్థులు డాక్టర్ మంగమూరి వర్షిణి సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. ఆ సూచనల మేరకు సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘రద్దయిన కాలేజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడానికి ముందు ఎన్ఎంసీ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించాలి. నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో ఎలా సర్దుబాటు చేస్తారో, సర్దుబాటు చేసే కాలేజీల్లోని వసతులు, ప్రస్తుత సీట్లు, వాటి పెంపు వంటి అంశాలపై ఎన్ఎంసీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ఈఎస్ఐసీ కాలేజీ, ఒక మహిళా కాలేజీతో కలిపి 19 ప్రైవేట్ నాన్–మైనారిటీ మెడికల్ కాలేజీలు, ఒక మహిళా కాలేజీతో కలిపి 4 ప్రైవేట్ మైనారిటీ కాలేజీలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన 250 సీట్లున్నాయి. వీటిల్లో సీట్లను పెంచే అవకాశం లేదు. మరో 4 ప్రభుత్వ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కోసం ఇప్పటికే సీట్ల సంఖ్య పెంచారు. మహబూబ్‌నగర్(గతంలో 150+ కొత్తగా 25), సిద్దిపేట్(150+25), ఆదిలాబాద్(100+20), నిజామాబాద్(100+20) సీట్లు పెరిగాయి. ఇక మిగిలిన రెండు నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రెండేళ్ల క్రితమే మంజూరయ్యాయి. వీటిల్లో 150 చొప్పున సీట్లున్నాయి. వీటిల్లో కొత్త సీట్లు మంజూరు చేసినా ఆ మేరకు సరిపడా వసతులు లేవు. ఎన్ఎంసీ.. సీట్లను సృష్టించిన తర్వాతే సీట్ల సర్దుబాటుకు వీలుంటుంది. అలాగే అదనపు ప్రవేశాలు చేసేందుకు ప్రైవేట్ కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వాలి’అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే.. ఇదే కేసులో ఎన్ఎంసీ కూడా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ప్రమాణాలు, సౌకర్యాలు, అధ్యాపకులు లేకపోతే సీట్లను రద్దు చేసే అధికారం మాకుంది. వసతుల లేమి కారణంగా రద్దయిన మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సీట్ల రద్దు సమయంలో మార్గదర్శకాలను రాష్ట్రానికి, సంబంధిత యూనివర్సిటీకి పంపించాం. రాష్ట్రం అనుమతి ఇచ్చాకే అడ్మిషన్లు జరుగుతాయి. రద్దయిన కాలేజీల్లోని సీట్ల సర్దుబాటు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. విద్యార్థుల నీట్ ర్యాంక్‌లు, ఇతర కాలేజీల్లో సీట్ల ఖాళీలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీట్లు సర్దుబాటు చేయాలి. ఒకవేళ కాలేజీల్లో సరిపడా సీట్లు లేకుంటే ఈసారికి మాత్రమే సీట్లు పెంచాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసీ అనుమతి ఇస్తుంది. ఎంబీబీఎస్‌లో 250 సీట్లు మించకుండా చూడాలి. పీజీ సీట్లనూ రాష్ట్ర సర్కారే సర్దుబాటు చేయాలి’అని పేర్కొంది. కాగా, ఈ పిటిషన్లలో తదుపరి విచారణ జూలై 7న జరగనుంది. -
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు అలెర్ట్ !
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో వైద్య విద్య అభ్యసనకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు కేటాయించడం.. ఎన్ఎంసీ నిర్దేశించిన విధానంలో పరీక్షల నిర్వహణతో ముగుస్తుంది. అయితే విదేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఫీజు ఆధారంగా సీట్లు పొంది కోర్సు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే భారత్‌లో కంటే అత్యంత సులువైన పద్ధతితో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే వారికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చేందుకు జాతీయ వైద్య మండలి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. 54 నెలలు మస్ట్ ఇప్పటికే కొన్ని రకాల నిబంధనలు ఉన్నా వాటిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ కోర్సును కనీసం 54 నెలలు పూర్తి చేయాలనే నిబంధనను కఠినతరం చేస్తోంది. అలాగే కాలేజీలో అడ్మిషన్ పొందేముందు అక్కడి మౌలిక వసతులు, అత్యాధునిక పద్ధతుల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ఆన్‌లైన్‌కి నో వైద్య విద్యలో ఆన్లైన్ పద్ధతిలో కొనసాగే తరగతులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్ఎంసీ భావిస్తోంది. పూర్తిగా మాన్యువల్‌లో, ప్రయోగ విధానంలో తరగతులు నిర్వహించడమే మేలని అంచనాకు వచ్చింది. విదేశాల్లో వైద్య కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ నిర్వహించినా.. తిరిగి ఇక్కడ ఎన్ఎంసీ పరీక్షలో అర్హత సాధించడంతో పాటు ఇంటర్న్‌షిప్ మనోమారు చేయాల్సిన అంశాలను కఠినంగా అమలు చేయనుంది. ఇప్పటికే ఎన్ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ తాజా పరిణామాలతో వీటిని రివైజ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు.. -
డాక్టర్ చదువు డీలా!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఇందులో భాగంగా వైద్య కళాశాలలకు సైతం వాటిల్లోని ప్రమాణాలు, కొన సాగుతున్న పరిశోధనలు, అందుతున్న సేవలు, పడకల సామర్థ్యం.. ఆక్యుపెన్సీ, అవుట్ పేషెంట్లు, బోధన సిబ్బంది, ఆర్థిక వనరులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు, దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇదే క్రమంలో 2021 సంవత్సరానికి కూడా ప్రకటించింది. అయితే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కూడా దేశంలోని టాప్ 50 వైద్య కళాశాలల్లో చోటు దక్కలేదు. ఈ సంవత్సరమే కాదు..గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో వైద్య విద్య దుస్థితికి ఇదే నిదర్శనమని వైద్య నిపుణులు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ప్రజల ప్రాణాలు కాపాడేలా చదువు నేర్పే వైద్య కళాశాలలు రాష్ట్రంలో తూతూమంత్రంగా నడుస్తున్నాయి. బోధన సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభా వం చూపిస్తోంది. ప్రధానంగా అధ్యాపకులు లేకపోవ డంతో వైద్య విద్యలో నాణ్యత నాసిరకంగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలనూ ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రైవేటు కళాశాలలు కూడా సరిపడా బోధన సిబ్బందిని నియమించుకోవడం లేదు. ఫీజుల వసూళ్లపై చూపెడు తున్న శ్రద్ధ విద్యా ప్రమాణాలు, సదుపాయాల కల్పన, పరిశోధనలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం ఒక మెడికల్ కాలేజీకి చెందిన వారిని మరో మెడికల్ కాలేజీకి పంపించి తగిన సంఖ్య చూపించి కాలేజీని రెన్యువల్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలే ఖాళీలు..! రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలా బాద్ (రిమ్స్), వరంగల్ (కాకతీయ), మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు కలిపి 2,866 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ దాదాపు 655 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంటోం ది. కానీ నిజానికి ఈ సంఖ్య వెయ్యి వరకు ఉంటుందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)’ను ఏర్పాటు చేసింది. ఖాళీ అయిన వెంటనే వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బోర్డు చైర్మన్‌గా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సభ్య కార్యదర్శిగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ పోస్టుల భర్తీపై శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలున్నాయి. పలు సర్కారీ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీ... నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2013లో నెలకొల్పిన ఈ కాలేజీలో అన్ని రకాలైన 750 పోస్టులు భర్తీ చేయాల్సి ఉం డగా ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రధానంగా ప్రొఫెసర్ పోస్టులు 35 మంజూరు చేయగా, రెగ్యులర్ 21 మంది, కాంట్రాక్ట్ పద్ధతిన ఇద్దరు ఉన్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. 57 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 17 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ పద్ధతిన ఉన్నారు. ఏకంగా 37 ఖాళీలున్నాయి. 109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 52 మంది రెగ్యులర్, 32 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నా రు. 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 23 మంజూరు కాగా, రెగ్యులర్ 9 మంది, కాంట్రాక్ట్‌లో 12 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 69 మంజూరు కాగా, 48 మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తుండటం గమనార్హం కాగా.. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ మెడికల్ కాలేజీ... నల్లగొండ మెడికల్ కాలేజీలో ట్యూటర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48, ప్రొఫెసర్లు 25 మంది ఉండాలి. అయితే ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 32, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 42, ట్యూటర్లు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీకి సొంత భవనం కూడా లేదు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోగల పాత భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులకు తోడు క్యాంటీన్, డైనింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీ.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడేళ్ల క్రితం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆధునీకరించి అందులో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు. కళాశాలలో మొదటి సంవత్సరం 150 మంది, ద్వితీయ సంవత్సరం 150 మంది చదువుకుంటున్నారు. ట్యూటర్లు 15, ప్రొఫెసర్లు 24, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 115, అసోసియేట్ ప్రొఫెసర్లు 48 మంది ఇలా మొత్తం 202 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ట్యూటర్లు 13, ప్రొఫెసర్లు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 80, అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మంది కలిపి మొత్తం 143 మందే పనిచేస్తున్నారు. 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పడిపోతున్న వైద్య విద్య నాణ్యత రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా అన్ని రకాల ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువు చెప్పే నాథుడే లేడు. ఉన్నవారే క్లాసులు తీసుకోవడం, పేషెంట్లను చూడడం, పేపర్లు దిద్దాల్సి ఉండటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చేప్పుడు ఒక కాలేజీ ఫ్యాకల్టీని మరో కాలేజీకి పంపిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌లో విద్యార్థులు సరిగా నేర్చుకోలేకపోతున్నారు. నాసిరకమైన వైద్య విద్య వల్ల పీజీ సీట్లు పొందలేకపోతున్నారు. – విజయేందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు, జూడా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 150 సీట్లతో మొదలైంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 25 సీట్లు పెరిగాయి. కళాశాలకు మొత్తం 981 పోస్టులు మంజూరు చేయగా ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 242 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్టు కలిపి 121 బోధన సిబ్బంది ఉండగా మరో 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్... ఆదిలాబాద్ రిమ్స్ 120 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతోంది. అయితే అనేక ఖాళీల కారణంగా వైద్య కళాశాలలో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. మరోపక్క ఖాళీ పోస్టుల కారణంగా ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఇలావుండగా రిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అన్ని హంగులతో నిర్మించారు కానీ, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కాకతీయ మెడికల్ కాలేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కాకతీయ మెడికల్ కాలేజీ 250 సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలోని 26 విభాగాల్లో 250 అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఇందులో 34 మంది ప్రొఫెసర్లకు గాను 27 మంది ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 71మంది అసోçసియేట్ ప్రొఫెసర్లకు 43 మంది ఉన్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 145 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 100 మంది ఉండగా 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలేజీలో ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన అకడమిక్ భవనం పూర్తయితే విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. 250 మంది విద్యార్థులు ఒకే తరగతి గదిలో సౌకర్యంగా కూర్చునే అవకాశం కూడా ఉంటుంది. -
1 నుంచి ‘మెడికల్’ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తున్నందున కాలేజీలను తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని మెడికల్ కాలేజీలను విశ్వవిద్యాలయం ఆదేశించింది. అయితే రెండో ఏడాది నుంచి చివరి ఏడాది వరకు వైద్య విద్య తరగతుల ప్రారంభం ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా నిర్ణయం జరగలేదు. వాస్తవానికి డిసెంబర్ 1 నుంచే తరగతులు నిర్వహించాలని ఎన్ఎంసీ రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ మేరకు తరగతులు ప్రారంభమయ్యాయి. చదవండి: విక్రమ్‌కు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వండి కానీ రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆసక్తి కనబరచకపోవడం, కరోనా నేపథ్యంలో సర్కారు వెనకడుగు వేయడంతో ఇప్పటివరకు రెండో ఏడాది ఆపై విద్యార్థుల తరగతులను ప్రారంభించలేదు. అయితే 9వ తరగతి నుంచి జూనియర్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యకు సంబంధించి కాలేజీలు ఒకటో తేదీ నుంచి తెరుచుకోవడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాది, ఆపై వైద్య విద్య తరగతుల విషయంపై రాష్ట్ర సర్కారు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే మెడికల్ కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపించామని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నాయి. ఆయా తరగతులు కూడా మొదటి ఏడాది వైద్య విద్య తరగతులతోనే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాళోజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే.. మొత్తం 55 వేల మంది విద్యార్థులు... కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 55 వేల మంది ఉంటారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. 33 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థుల సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారు. మరో 20 వేల మంది నర్సింగ్ విద్యార్థులు, 6 వేల మంది డెంటల్ విద్యార్థులు, 5 వేల మంది పిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని తెలిపింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 5,040 మంది ఉంటారని విశ్వవిద్యాలయం పేర్కొంది. కరోనా టెస్టులు చేశాకే అనుమతి... మెడికల్ కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కాలేజీలు తెరిచాక పాటించాల్సిన నిబంధనలు, దానికి ముందు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేసింది. కరోనాతో గతేడాది మార్చి నుంచి మెడికల్ కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం అన్ని థియరీ క్లాసులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్, క్లినికల్ క్లాసులు నిర్వహించడానికి, చివరి సంవత్సరం విద్యార్థుల కోసం కాలేజీలను ప్రధానంగా తెరవాల్సి ఉంది. మార్గదర్శకాలు ఇవి... ► కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారినే కాలేజీల్లోకి అనుమతించాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పనిసరి. ► జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలుంటే కాలేజీలోకి అనుమతించొద్దు. ► తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలి. ► విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఉమ్మివేయడం నిషేధం. ► కచ్చితంగా మాస్క్ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో ఉపయోగించాలి. ► ప్రతి కాలేజీలో టాస్క్‌ఫోర్స్ లేదా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ టీంను ఏర్పాటు చేసుకోవాలి. ► రెండు షిఫ్టులుగా లేదా రొటేషన్ పద్ధతిలో ప్రాక్టికల్స్, థియరీ తరగతులు నిర్వహించాలి. ► థియరీ క్లాసులను ఆన్లైన్ ద్వారా నడిపించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించాలి. ► హాస్టల్ గదుల్లో ఒకరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► మెస్‌లో టైం స్లాట్ ప్రకారం విద్యార్థులకు భోజన, అల్పాహారం ఏర్పాట్లు చేయాలి. ► విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి. -
లైబ్రరీ కుదింపు.. రీసెర్చ్ కనుమరుగు!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ఇక మంగళం పాడినట్లేనా? లైబ్రరీల్లో పుస్తకాలు రాన్రాను కనుమరుగేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై కేంద్రం తాజాగా కొన్ని సవరణలు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సవరణ నిబంధనలను తాజాగా జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఇప్పటివరకు తప్పనిసరిగా సెంట్రల్ రీసెర్చి ల్యాబ్ ఉండాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. కాలేజీ అభీష్టం మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇది వైద్య పరిశోధనకు విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. చదవండి: కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు పరిశోధనలకు మంగళం? కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీలు తప్పనిసరి కాదని పేర్కొన్నారు. అయితే, పూర్తిగా పరిశోధనలు వద్దనలేదని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి మెడికల్ కాలేజీల్లోని సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీల్లో జరిగే పరిశోధనల్లో కాలేజీల్లోఅధ్యాపకులుగా పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారు. బోధనాసుపత్రికి వచ్చే రోగులపై ఈ పరిశోధనలు జరుగుతుంటాయి. బోధనా సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందించడానికి హై–స్పీడ్ గ్రాఫిక్ వర్క్‌స్టేషన్, హై–స్పీడ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్స్టేషన్లు ఉంటాయి. వీటిలో క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. కొన్ని రోగాల్లో వచ్చే మార్పులను, కొత్త రోగాలపైనా క్లినికల్ రిసెర్చ్‌లు జరుగుతుంటాయి. వైద్య విద్యార్థుల్లో, బోధకుల్లో నైపుణ్యాన్ని, వ్యాధులపై అవగాహనను పెంచే ఇటువంటి పరిశోధనలను కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. చదవండి: తెలంగాణ బ్రాండ్.. సర్కారీ మెడికల్ షాపులు! రెండేళ్లు ఆసుపత్రి నిర్వహిస్తేనే.. ఇప్పటివరకు మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చాకే ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేళ్ల క్రితం ఏర్పాటుచేసి, అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనేది కొత్త నిబంధన. పైగా రెండేళ్లూ 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఆసుపత్రి లేని కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కరువవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20–25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను తొలగించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో స్థల సమస్య వల్ల బహుళ అంతస్తులు నిర్మించి కాలేజీ నిర్వహించుకోవచ్చు. మెడికల్ కాలేజీల్లో కనీసం 24 శాఖలు ఉండాలి. ప్రతి కాలేజీకి తొలుత 100 – 150 సీట్లతో అనుమతిస్తారు. ఆపై సమకూర్చుకునే సౌకర్యాలనుబట్టి ఆ సంఖ్యను ఏటా పెంచుతారు. కొత్త కాలేజీల్లో లైబ్రరీ–పుస్తకాలు ఇలా.. కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల్లో లైబ్రరీకి పెద్దగా స్థలం కేటాయించాల్సిన అవసరం లేదని తాజా సవరణల్లో ఉంది. పైగా వాటిలో పుస్తకాల సంఖ్యనూ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్లున్న మెడికల్ కాలేజీ లైబ్రరీలో 7 వేల పుస్తకాలు, 150 సీట్లున్న కాలేజీలో 11 వేలు, 200 సీట్లున్న కాలేజీలో 15 వేలు, 250 సీట్లున్న కాలేజీ లైబ్రరీలో 20 వేల పుస్తకాలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఈ పుస్తకాల సంఖ్యను వరుసగా 3 వేలకు, 4,500కు, 6 వేలకు, 7 వేలకు కుదించారు. అలాగే లైబ్రరీ వైశాల్యాన్నీ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్ల కాలేజీలో 1,600 చదరపు మీటర్లు, 150 సీట్లున్న కాలేజీలో 2,400 చ.మీ. వైశాల్యంతో లైబ్రరీ ఉండాలి. కొత్త నిబంధనలో 100 నుంచి 150 సీట్లున్న కాలేజీల్లో లైబ్రరీ వైశాల్యాన్ని వెయ్యి చ.మీ.కు కుదించారు. ప్రస్తుతం 200 సీట్లున్న కాలేజీలో 3,200 చ.మీ., 250 సీట్లున్న కాలేజీలో 4 వేల చ.మీ. వైశాల్యంలో లైబ్రరీ ఉండగా, ఇకపై 200 నుంచి 250 సీట్లున్న కాలేజీల్లో 1,500 చదరపు మీటర్ల వైశాల్యంలోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యవసర వైద్యం తప్పనిసరి ప్రతి కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌కు కేటాయించాలి. దీంతో అత్యవసర రోగులకు వైద్యసాయం అందుతుంది. అలాగే ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రియాబిలిటేషన్ సెంటర్ గతంలో ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశారు. స్కిల్ లేబొరేటరీని కొత్తగా చేర్చారు. వంద సీట్లున్న కళాశాలకు 19 విభాగాల్లో 400 పడకలు ఏర్పాటుచేయాలి. 150 సీట్లున్నచోట 600 పడకలు, 200 సీట్ల కళాశాలలో 800 పడకలు, 250 సీట్లున్నచోట వెయ్యి పడకలు తప్పనిసరి. వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను కుదించారు. ఎమర్జెన్సీ స్టాఫ్ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఆప్షన్‌గా చేశారు. లెక్చర్ హాళ్లను తగ్గించేశారు. ఇక కొన్ని మెడికల్ విభాగాల్లో పడకల సంఖ్యను కుదించారు. అలాగే, ప్రతి ఏటా కాలేజీని తనిఖీ చేయాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించారు. డాక్టర్ల విషయం చెప్పలేదు కానీ, పారామెడికల్ సిబ్బందిని తగ్గించారు. ఇంకొన్ని నిబంధనలు విజిటింగ్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకోవచ్చు. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. ఎమర్జెన్సీ విభాగంలో అదనపు ఫ్యాకల్టీని నియమించాలి.అన్ని మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాల ద్వారా తరగతి గదులు, రోగులకు అందే వైద్యసేవల లైవ్ స్ట్రీమింగ్‌ను జాతీయ వైద్యమండలి ఆధ్వర్యంలో నడిచే డిజిటల్ మిషన్మోడ్ ప్రాజెక్టుతో అనుసంధానించాలి. అనాటమీ విభాగంలో భౌతికకాయాలను కోసి పరిశీలించేందుకు వీలుగా 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో డిసెక్షన్ హాల్ ఏర్పాటుచేయాలి. 400 చ.మీ. వైశాల్యంతో పోస్ట్‌మార్టం/అటాప్సీ బ్లాక్ ఉండాలి. విద్యార్థుల శిక్షణకు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండాలి. ఎయిర్ కండీషన్డ్ బ్లడ్‌బ్యాంక్ నిర్వహించాలి. 24 గంటల పార్మసీ సేవలు అందుబాటులో ఉంచాలి. పుస్తకాలు చదివేది తక్కువే డిజిటల్ యుగంలో చాలామంది ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లలో సమాచారం వెతుక్కుంటున్నారు. వాటిలోనే చదువుకుంటున్నారు. కాబట్టి పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. అందుకే ఎన్ఎంసీ లైబ్రరీల వైశాల్యాన్ని కుదించింది. పుస్తకాల సంఖ్యను తగ్గించింది. పరిశోధనలను పూర్తిగా వద్దని చెప్పలేదు. – డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు పరిశోధనలతోనే మేలు కొన్ని జబ్బులపై అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి థీసిస్‌లు సమర్పిస్తారు. వాటిని మెడికల్ జర్నల్స్‌ల్లో ప్రచురిస్తారు.ఆ మేరకే వారికి పదోన్నతులు లభిస్తాయి. మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చి లేబొరేటరీలు ఉంటే పరిశోధనలకు ఊపు వస్తుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
పేదలకు వైద్యం దూరం చేసేలా ప్రభుత్వ వైఖరి
సాక్షి, హైదరాబాద్: పేద వాడికి వైద్యాన్ని దూరం చేసే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ఉందని టీపీసీసీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కౌన్సిల్ రద్దు వెనక దురుద్దేశం ఉందన్నారు. మోడ్రన్ మెడిసిన్‌ను ప్రోత్సాహించకుండా.. ఎవరో యోగా గురువు ఇచ్చే మందులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ఉందని ఆయన ఆరోపించారు. నేషనల్ మెడికల్ కమిషన్ పక్కగా కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాస్తుందని మండి పడ్డారు. పేద ప్రజలను వైద్యానికి దూరం చేసేలా ఉన్న ఈ విధానాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైద్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు లేవని.. నిధుల కొరతతో ఆస్పత్రులు చతికిల పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సత్యనారాయణ తెలిపారు. -
ఎన్ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు
వైద్య విద్యకు తూట్లు పొడిచే ఎన్ఎంసీ బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు పోరు బాటు పట్టారు. ఈ బిల్లు వల్ల ప్రతిభతో సంబంధం లేకుండా డబ్బు ఉన్నవారే వైద్యులు అవుతారని మండిపడ్డారు. వేటు కళాశాలలకు వరంగా ఉన్న ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ ) : ఎన్నో అభ్యంతరాలు ఉన్నా పార్లమెంట్ పొందిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) బిల్లుతో వైద్య విద్యకు తూట్లు పడతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంనే) విశాఖ శాఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.ఎ.రమణి అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధత కల్పించిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం కేజీహెచ్ వైద్యులు, వైద్య విద్యార్థులు ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్వో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర వైద్య శాఖ మంత్రికి పంపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నూతనంగా ప్రవేశపెడుతున్న నేషన్ మెడికల్ కమిషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్ఎంసీలో నియమించనున్న 25 మంది సభ్యుల్లో వైద్య పరిజ్ఞానం లేనివారే అధికంగా ఉన్నారని చెప్పారు. దీని ద్వారా వైద్య వైద్య విద్యను కొనుక్కునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ బిల్లు వద్దని అనేక వినతులు అందజేసినా అవన్నీ తొక్కిపట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడం ద్వారా వైద్య విద్యను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వైద్య విద్య ప్రైవేటు పరం జాతీయ మెడికల్ కౌన్సిల్ అవినీతి రహితంగా పనిచేస్తుందని, దీన్ని రద్దు చేసి ఎన్ఎంసీ బిల్లు ఆమోదించడం అన్యాయమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఈ బిల్లు వల్ల వారు వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోతారన్నారు. ఇప్పటి వరకు 85 శాతం రిజర్వేషన్లు ఉండగా ఈ బిల్లుతో ప్రైవేటు కళాశాలలకు 50 శాతం యాజమాన్య కోటాలకు పోతాయన్నారు. ఎగ్జిట్ పరీక్షపై స్పష్టత లేదు ఎన్ఎంసీ ద్వారా నిర్వహించనున్న ఎగ్జిట్ పరీక్ష విధానంలో స్పష్టత లేదని, ఎంబీబీస్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవిష్యత్తును ఎగ్జిట్ పరీక్ష నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే తప్ప తాను చదివిన వైద్య విద్యను సార్థకం చేసుకోలేడని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ దీప్‌చంద్ అన్నారు.ఆ పరీక్ష ఫెయిల్ అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థితో సమానంగా ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ వైద్యులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినా కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లు పేరిట ఆర్ఎంపీ వైద్యులకు ఆరు నెలల బ్రిడ్జి కోర్సును నిర్వహించి వారిని గ్రామీణ ప్రాంతాల్లో నియమించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో న్యాయం లేదన్నారు. ముందుగా నోటీసు ఇవ్వలేదు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేజీహెచ్‌లోని వైద్యులు, జూనియర్ వైద్యులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిరసన చేపట్టడం సమంజసం కాదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. అర్జున పేర్కొన్నారు. రాత్రి నోటీసు మరుసటి రోజు విధులకు హాజరుకామని చెప్పడం తగదని. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వారే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఓపీ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ఐఎంఏ, జూనియర్ వైద్యులు చెబుతున్నా, వైద్య విద్యా సంచాలకులకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. నేటి నుంచి సమ్మెలోకి జూడాలు 1 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఏపీ జూనియర్ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జునకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ విశాఖ శాఖ అధ్యక్షుడు డాక్టర్ దీప్‌చంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన నిరసన తెలియజేసేందుకు రాష్ట్ర నాయకులతో చర్చి స్తున్నామని, దిశా నిర్దేశం జరిగిన తర్వాత రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసనకు తమ మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. ఎన్ఎంసీ బిల్లు లోప భూయిష్టం జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లు లోపభూయిష్టంగా ఉన్నా కేంద్రం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందు ఒక కమిటీని వేయాల్సి ఉంది. ఈ కమిటీ ఐఎంఏ, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం సేకరించి బిల్లును పూర్తి స్థాయిలో రూపొందించి ఉంటే దేశ వ్యాప్తంగా ఆందోళన జరగకుండా ఉండేది కాదు. – డాక్టర్ జి.అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
‘నీట్’ పరీక్షపై విచారణ వాయిదా
వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం జాతీయ వైద్యమండలి ప్రతిపాదించిన నీట్ పరీక్షపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. మార్చి 31 నాటికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘానికి నిర్ధేశించింది. తదుపరి నాలుగు రోజుల్లో ప్రతిస్పందనలు ఇవ్వాలని జాతీయ వైద్య మండలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.