సాక్షి, అమరావతి: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్‌ట్)పై మంగళవారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) వెబినార్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఈ వెబినార్‌లో పాల్గొనాలని ఇప్పటికే ఎన్‌ఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఎంబీబీఎస్ పాసైనవారు ఉన్నత విద్య, ప్రాక్టీస్, రిజిస్టేషన్‌ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న వేర్వేరు విధానాలన్నింటినీ తొలగించి నెక్స్‌ట్ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఎన్‌ఎంసీ భావిస్తోంది.
ఈ క్రమంలో నెక్స్‌ట్ గురించి విద్యార్థులు, అధ్యాపకులకు ఈ వెబినార్‌లో ఎన్‌ఎంసీ చైర్మన్ సురేశ్ చంద్ర శర్మ వివరిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వెబినార్ కోసం లెక్చర్ హాల్స్‌లో ప్రిన్సిపాల్స్ ఏర్పాట్లుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment