సాక్షి, హైదరాబాద్: పేద వాడికి వైద్యాన్ని దూరం చేసే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ఉందని టీపీసీసీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కౌన్సిల్ రద్దు వెనక దురుద్దేశం ఉందన్నారు. మోడ్రన్ మెడిసిన్‌ను ప్రోత్సాహించకుండా.. ఎవరో యోగా గురువు ఇచ్చే మందులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ఉందని ఆయన ఆరోపించారు. నేషనల్ మెడికల్ కమిషన్ పక్కగా కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాస్తుందని మండి పడ్డారు. పేద ప్రజలను వైద్యానికి దూరం చేసేలా ఉన్న ఈ విధానాన్ని టీఆర్‌ఎస్ వ్యతిరేకించకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో వైద్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు లేవని.. నిధుల కొరతతో ఆస్పత్రులు చతికిల పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment