![Vizianagaram Govt Medical College Permission Approved By National Medical Council - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/21/Medical-College.jpg.webp?itok=4r8q8yHB)
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
చదవండి AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment