థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం | Medical Students Are Happy Building Medical Colleges In AP With World Class Facilities - Sakshi
Sakshi News home page

థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం

Published Fri, Sep 15 2023 4:03 PM | Last Updated on Fri, Sep 15 2023 4:56 PM

Medical Students Happy Building Medical Colleges In AP With World Class Facilities - Sakshi

సాక్షి,  విజయనగరం:  ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యా­యా­­నికి నాంది పలికారు. విజయ­నగరం, ఏలూ­రు, రాజమహేంద్ర­వ­రం, మచిలీప­ట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటై­న ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం జగన్‌ ప్రారంభించారు. విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారాయన.

వరల్డ్‌క్లాస్‌ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మెడికల్‌ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


వైద్య విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే..

మాది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం
సీఎం సార్, మన రాష్ట్రంలో వరల్డ్‌ క్లాస్‌ సౌకర్యాలతో ఇన్ని మెడికల్‌ కాలేజీలు నిర్మించడంపై మేం మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఆర్ధికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చాను, మా కుటుంబంలో నేను మొదటి డాక్టర్‌ను, మీ ప్రభుత్వంలో నేను డాక్టర్‌ అవడం గొప్పగా ఫీలవుతున్నాను, ఇది నా అభిప్రాయమే కాదు నాతోటి విద్యార్ధులందరి అభిప్రాయం. 

ఇన్ని మౌలిక సదుపాయాలతో అధునాతనమైన వైద్య విద్య మాకు అందుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు, మంచి అనుభవమున్న టీచింగ్‌ స్టాఫ్‌ని కూడా మాకు ఇచ్చారు, చక్కటి హాస్టల్‌ కూడా ఉంది, మంచి వాతావరణం కూడా ఉంది, మీరు మా విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉన్నారు, నేను మీకు మాట ఇస్తున్నాను, మీ సంకల్పం వల్లే నా కల నెరవేరింది, ఈ విజయానికి మీరే కారణం, మీలా ప్రజాసేవ చేయాలని, మీ అంత గొప్పగా అయ్యేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు, ధ్యాంక్యూ సార్‌. 
-ప్రసూన, వైద్య విద్యార్ధిని, విజయనగరం మెడికల్‌ కాలేజ్‌

మా జగనన్న వల్ల ఇన్ని మార్పులు  ఊహించలేదు
గుడ్‌ మార్నింగ్‌ అన్నా, నేను విజయనగరం జిల్లాకు చెందిన అమ్మాయిని, మేం ఎస్టీలం, మా నాన్న దినసరి కూలీ, అమ్మ గృహిణి, నేను చిన్నప్పటి నుంచి సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో చదువుకున్నాను, నీకు ఎంబీబీఎస్‌ ఎందుకు, రాదని చాలామంది చెప్పారు, 

కానీ మా జగనన్న వల్ల వైద్య విద్యలో ఇన్ని మార్పులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వ కాలేజ్‌ అంటే ముందు భయపడ్డా కానీ తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యపోయా, అంతా డిజిటలైజేషన్, స్కిల్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి, మాలాంటి పేద, మధ్యతరగతి పిల్లలు వైద్య విద్య చదువుతున్నారంటే మీరే కారణం, మా కుటుంబంలోనే కాదు మా ఊరిలోనే మొదటి డాక్టర్‌ను, నేను ప్రజలకు మంచి సేవలు అందిస్తానని మీకు మాట ఇస్తున్నాను, 

నవరత్నాల వల్ల కూడా చాలా లబ్ధి జరిగింది మాకు, మీరు వచ్చిన తర్వాత స్కూల్స్‌ చాలా మారిపోయాయి, మా అమ్మకు క్యాన్సర్, క్రిటికల్‌ స్టేజ్‌ అన్నారు, చాలా ఖర్చవుతుందనుకున్నాం, నమ్మకం కోల్పోయాం, కానీ ఆరోగ్యశ్రీ వల్ల మేం రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయించాం, మా అమ్మ నన్ను చూస్తుందంటే మీరే కారణం, మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని కులం, మతం, ప్రాంతం చూడకుండా నేను సేవలు అందిస్తాను, మీరు సీఎంగా ఉంటారు, నేను డాక్టర్‌గా ఉంటాను, ఇద్దరం ప్రజలకు సేవ చేద్దాం అన్నా, ధ్యాంక్యూ అన్నా.
-గగనశ్రీ, వైద్య విద్యార్ధిని, రాజమహేంద్రవరం గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌

మీకు రుణపడి ఉంటాం
సార్‌ మాది దిగువ మధ్యతరగతి కుటుంబం, మా నాన్న చిన్న వ్యవసాయ కూలీ, మా అమ్మ టైలర్, వాళ్ళ రెక్కల కష్టంతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ అవ్వాలన్న కోరిక ఉండేది, కానీ పేరెంట్స్‌ ఆర్ధిక పరిస్ధితులతో భయపడ్డారు, నేను గవర్నమెంట్‌ స్కూల్‌లో చదివాను, కొత్త కాలేజ్‌లో నాకు ఎంబీబీఎస్‌ సీట్‌ వచ్చింది, మా ఫ్యామిలీలో నేను మొదటి డాక్టర్‌ను, మా కుటుంబం డాక్టర్‌ కుటుంబంగా మారుతుంది. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం, ధ్యాంక్యూ సార్‌. 
-కోటేశ్వరి, కంభంపాడు, వైద్య విద్యార్ధిని, ఏలూరు

మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు
సార్, మాది అనంతపురం జిల్లా, నేను రెండేళ్ళ వెటర్నరీ సైన్స్‌ చదివిన తర్వాత మూడోసారి నీట్‌లో ఎంబీబీఎస్‌ వచ్చింది, ఈ కాలేజ్‌ లేకపోతే నాకు ప్రైవేట్‌ కాలేజ్‌లో సీట్‌ వచ్చేది, కాలేజ్‌ చాలా బావుంది, ఇంత మంచి కాలేజ్‌ చూడలేదు, హాస్టల్‌ బావుంది, క్లీన్‌ గా ఉంచుతున్నారు, ప్రేవేట్‌ మెడికల్‌ కాలేజ్‌ను తలపిస్తుంది, స్కిల్‌ ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేశారు, మాకు మంచి ప్రొఫెసర్స్‌ ఉన్నారు, మంచి ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు, పెద్ద లైబ్రరీ ఉంది, డిజిటల్‌ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు, క్వాలిటీ చక్కగా ఉంది, సెక్యూరిటీ బావుంది, మీరు మంచి వైద్యవిద్య అందిస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు, ధన్యవాదాలు. మేం రాబోయే రోజుల్లో మంచి డాక్టర్లగా సేవలందిస్తాం, మా రాయలసీమకు ఒక వెలుగు వచ్చింది, మా కల సాకారం అయింది, ధ్యాంక్యూ సార్‌. 
-జలదుర్గం త్రిభువని, మెడికల్‌ స్టూడెంట్, నంద్యాల

ఇంత మంచి కాలేజ్‌లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నా
సీఎం సార్‌ నేను ఇక్కడ చదువుకోవడం సంతోషంగా ఫీలవుతున్నాను, ఇది మంచి అవకాశం, మా కుటుంబ నేపధ్యం కూడా అంతంతమాత్రమే, ఇన్ని సౌకర్యాలతో ఇంత మంచి కాలేజ్‌లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నాను. మెడికల్‌ స్టూడెంట్స్‌కు అవసరమైన ప్రతిది ఇక్కడ ఏర్పాటు చేశారు, క్యాంపస్‌ చాలా బావుంది. థాంక్యూ సార్‌. 
-సచిన్‌ దాండియా , మెడికల్‌ స్టూడెంట్, ఆల్‌ ఇండియా కోటా, రాజస్ధాన్, మచిలీపట్నం మెడికల్‌ కాలేజ్‌ 

మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు
సార్, నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదువుకుని వైద్యరంగంలోకి వచ్చాను, నేను గుంటూరు మెడికల్‌ కాలేజ్‌లో చదువుకున్నాను, నేను పీజీ కూడా ఇక్కడే చేస్తున్నాను. వైద్య విద్యలో మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, మా జీఎంసీ ఏర్పాటై 76 సంవత్సరాలు అయింది, ఈ నాలుగేళ్ళలో మాకు 80కు పైగా పీజీ సీట్లు పెరిగాయి, గతంలో సీట్లు రాక నిరుత్సాహంతో ఉండేవారు కానీ మీరు వచ్చిన తర్వాత మనసు పెట్టి చదివితే సీట్లు వస్తున్నాయి, 

మీకు రుణపడి ఉంటాం, రిక్రూట్‌మెంట్‌ త్వరగా జరుగుతుంది, జీరో వేకెన్సీ పాలసీ, మా ప్రొఫెసర్స్‌ కూడా సంతోషంగా ఉన్నారు, మా జీఎంసీలో మంచి ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుచేశారు, కోవిడ్‌ సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయంటే ఈ ఎక్విప్‌మెంటే కారణం, కార్పొరేట్‌ ఆసుపత్రులకు పోటీగా జీఎంసీ ఉంది, అధునాతనమైన సౌకర్యాలు వచ్చాయి, క్యాన్సర్‌ విభాగంలో రేడియో థెరపీ ఏర్పాటు చేశారు, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రాసెస్‌లో ఉంది, ఓపీ టైం కూడా పెంచడం వల్ల పేదలకు అన్నీ అందుతున్నాయి, రోజుకు 3500, 4000 ఓపీ కేసులు చూస్తున్నాం, క్యాజువాల్టీలు కూడా పెరిగాయి, ఇది మంచి అనుభవం, రేపటి మా భవిష్యత్‌ కోసం మీరు ఈ రోజు వేసే ఈ ఆరోగ్య పునాది మీకు ఉన్న ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ కలకు నిదర్శనం, మీరు ఈ బీజాన్ని వేయడానికి కష్టపడుతుంటే అర్ధం కాదేమో ఎవరికీ, కానీ అది మహా వృక్షమై మాకు ఉద్యోగ ఫలాలు, ప్రజలకు ఆరోగ్య ఫలితాలు ఇస్తుంటే తెలుస్తుంది, సామాన్యులకు మీ విజన్‌ ఏంటో మీ మిషన్‌ ఏంటో, చిరునవ్వుతో పెను మార్పులు చేయచ్చు అని తెలుసుకున్నాం మిమ్మల్ని చూసి, ఏపీని హెల్తీ అండ్‌ హ్యపీ స్టేట్‌గా చూస్తున్నాం, ధ్యాంక్యూ. 
-డాక్టర్‌ అలేఖ్య, పీజీ స్టూడెంట్, గుంటూరు మెడికల్‌ కాలేజ్‌

ఏపీని మీరు మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు
సార్, మాది కేరళ, ఆల్‌ ఇండియా కోటాలో ఇక్కడ చదువుతున్నాను, మీ నాన్నగారు, మీరు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, ఏపీని మీరు మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు, పీజీ సీట్లు కూడా పెంచారు, మీకు ధన్యవాదాలు, నేను ఏపీని ఎంచుకోవడానికి కారణం, ఇక్కడ మంచి వాతావరణం, మంచి విద్య అందుతుందనే కారణం, ప్రతి మెడికల్‌ కాలేజీలో అనేక అసౌకర్యాలు ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు, నాడు నేడు కింద అన్ని మౌలిక సదుపాయాలు, అధునాతన టెక్నాలజీ ఏర్పాటు చేయడం వల్ల మా పీజీ విద్యార్ధులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనకు మీరు చేస్తున్న ప్రయత్నంలో మేం భాగస్వామ్యులవుతాం, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష చక్కటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు చాలా ఉపయోగపడుతుంది, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ చాలా బావుంది, మీరు ఏపీ ప్రజల దేవుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, మీ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ కలను సాకారం చేస్తామని మాట ఇస్తున్నాం, థ్యాంక్యూ సార్‌. 
డాక్టర్‌ ఐశ్వర్య, పీజీ స్టూడెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజ్, తిరుపతి

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌లకు ధీటుగా గవర్నమెంట్‌ కాలేజ్‌లు
సార్‌ మాకు మెడికల్‌ కాలేజీలలో మంచి విద్య, సౌకర్యాలు అందుతున్నాయి, దీని వల్ల మంచి అనుభవం వస్తుంది, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌లకు ధీటుగా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఏర్పాటు చేశారు, టీచింగ్‌ ఫ్యాకల్టీ బావుంది, నేను మంచి డాక్టర్‌గా సేవలందిస్తానని మీకు మాట ఇస్తున్నాను.
-డాక్టర్‌ అనంత్, పీజీ స్టూడెంట్, విజయనగరం మెడికల్‌ కాలేజ్‌

చదవండి: వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్‌ కాలేజీలు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement