Updates..
► విజయనగరం పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన సీఎం జగన్.
సీఎం జగన్ కామెంట్స్ ఇవే..
► సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీ కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరో 17 మెడికల్ కాలజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలి. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో వీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను.
► వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరింది. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. మరో 18 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తాం. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 10,032 విలేజ్ క్లీనిక్స ఏర్పాటు చేశాం. గ్రామస్థాయిలో ఆశావర్కర్లతో సేవలు అందిస్తున్నాం.
► ప్రతీ మండలానికి ఒక పీహెచ్‌సీ. ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్‌కు విస్తరించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. గతంతో పోలిస్తే వైద్యానికి భారీగా బడ్జెట్ పెంచాం. 108, 104 వాహనాల సంఖ్యను పెంచాం. వైద్యరంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం. మీరంతా పేదవారికి సేవ చేయాలి. హెల్త్ సెక్టార్ కోసం 53,126 మందిని రిక్రూట్ చేశాం. 2.35 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాం. పెన్షన్‌ను నేరుగా ఇంటి తలుపు తట్టి అందిస్తున్నాం.
► ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు.
► ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ స్థాయిలో సదుపాయాలతో కాలేజీ నిర్మాణం అద్భుతం. మెడిసిన్ చదవాలనుకున్న మా కల సాకారమవుతోంది. సీఎం జగన్‌కు మా కృతజ్ఞతలు.
► ట్రీట్మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులు.. సీఎం జగన్‌కు వివరించారు.
► సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.
► మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్.
► విజయనగరంలో సీఎం జగన్ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.
► మెడికల్ కాలేజీ ప్రాంగణానికి బయలుదేరిన సీఎం జగన్
► సీఎం జగన్ విజయనగరం చేరుకున్నారు.
► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం రాజన్న దొర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు
► విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున
►మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ విజయనగరం బయలుదేరారు.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి అనంతరం.. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించనున్నారు.
► ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు.
► అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం జగన్ ప్రసంగిస్తారు.
► అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.
► ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం.
► ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
► వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్న జగనన్న ప్రభుత్వం.
► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతుల ప్రారంభం.
► స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు.
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచిన జగనన్న ప్రభుత్వం.
► వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902
► మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి..
► దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు.
► 2024-25లో ప్రారంభించే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె
► 2025-26లో ప్రారంభించే 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ
► గిరిజన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల
► 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
కిడ్నీ రిసెర్చ్ సెంటర్, పలాస
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుపతి
మానసిక ఆరోగ్య కేంద్రం, కడప
Comments
Please login to add a commentAdd a comment