గతంలో ధ్వంసం చేసి, మతపెద్ద ఆక్రమించుకున్న ఓ హిందూ మందిరాన్ని పునర్నిర్మించి పరిరక్షించాల్సిందిగా పాకిస్తాన్
ఇస్లామాబాద్: గతంలో ధ్వంసం చేసి, మతపెద్ద ఆక్రమించుకున్న ఓ హిందూ మందిరాన్ని పునర్నిర్మించి పరిరక్షించాల్సిందిగా పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఖైబర్ పక్తూంక్వా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగేలా జరుగుతున్న అసాంఘిక సంఘటనల్లో జోక్యం కల్పించుకోవాల్సిందిగా రమేశ్ కుమార్ వంక్వాని అనే హిందువు కోర్టును కోరారు.
అలాగే ఖైబర్ పక్తూంక్వాలోని ఓ గ్రామంలో శ్రీ పరమహంస జీ మహరాజ్ సమాధిని కూల్చివేసి, ఆక్రమించుకోవడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ విషయంలో సామరస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని అదనపు అడ్వొకేట్ జనరల్ వకార్ అహ్మద్.. ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ దేవాలయాన్ని పునర్ నిర్మించి పరిరక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.