జమ్మలమడుగు: మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి జంట హత్య కేసులకు సంబంధించిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జమ్మలమడుగు: మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి జంట హత్య కేసులకు సంబంధించిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆగస్టు 21న, సెప్టెంబర్ 18 వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే రెండు సార్లూ వారుుదా పడింది. ఈనెల 12,13 తేదీల్లో విచారణతోపాటు తీర్పు వెలువడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
1990లో హైదరాబాద్‌లోని జడ్చర్ల, షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను హత్య చేశారు. ఈ హత్య కేసులో 11మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఉన్నారు. 2004లో నాంపల్లి కోర్టు రామసుబ్బారెడ్డిని దోషిగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రరుుంచారు. కోర్టు ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది.
జడ్జీలు భాను, మీనాకుమారిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెరో రకంగా ఇచ్చారు. దీంతో హైకోర్టు జడ్జి బిలాల్ న క్వీ రామసుబ్బారెడ్డి నిర్దోషి అంటూ తీర్పు నిచ్చారు. ఈ తీర్పుపై స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009లో ప్రత్యేక ధర్మాసనంలో పిటిషన్ అడ్మిట్ అయింది. దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తోంది.
ఢిల్లీలో మకాం వేసిన నాయకులు షాద్‌నగర్ జంట హత్యలకు సంబంధించిన కేసు బుధ, గురువారాల్లో తీర్పు వెలువడుతుందనే ఉద్ధేశ్యంతో స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఈకేసును సుప్రీం కోర్టు కొట్టేస్తుందని టీడీపీ నాయకులు కార్యకర్తలు భావిస్తుండగా, ఎమ్మెల్యే అనుచరులు మాత్రం తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.