పరువునష్టం కేసుల్లో కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీ ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులపై ఆయన పిటిషన్‌కు సంబంధించి 6 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అత్యంత అవినీతిపరుల జాబితాలో కేజ్రీవాల్ తన పేరు చేర్చారంటూ కేంద్రమంత్రి గడ్కారీ కోర్టుకెక్కగా, ఆప్ విద్యుత్ చార్జీల తగ్గింపు ఉద్యమంలో నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌పై కేజ్రీవాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మాజీ రాజకీయ కార్యదర్శి కేసు పెట్టారు.