ఒక నేతకు నివాళిగా ఒకే వాణిజ్య ప్రకటన | A tribute to the one closer to the advertisement | Sakshi
Sakshi News home page

ఒక నేతకు నివాళిగా ఒకే వాణిజ్య ప్రకటన

Published Tue, Oct 7 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

A tribute to the one closer to the advertisement

న్యూఢిల్లీ: మీడియాకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే విషయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు నియమించిన ఓ కమిటీ పేర్కొంది. అదే సమయంలో అధికారంలో ఉన్నవారిని స్తుతించేలా ఆ ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని వాణిజ్య ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ మేరకు ఓ కమిటీని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించింది.

ఈ విషయమై సంబంధిత కమిటీ తాజాగా సుప్రీం కు పలు సిఫారసులు చేసింది. ఏ ఏ ప్రముఖ వ్యక్తుల జయంతి, వర్ధంతికి ప్రకటనలు ఇవ్వాలనే దానిని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించాలని, ఆ ప్రకటనను ఏ విభాగం ఇవ్వాలో కూడా ఖరారు చేయాలని సూచించింది. దీనివల్ల ఒకే నేతకు నివాళిగా పలు ప్రకటనలు ఇవ్వడాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. అలాగే ఆ ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement