బీసీసీఐకి సుప్రీం కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఎందుకు లీగ్ నుంచి తొలగించకూడదని బీసీసీఐ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. అలాగే ముద్గల్ క మిటీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులు బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చే యరాదని సూచించింది.
ఈ విచారణను జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాతో కూడిన బెంచ్ చేపట్టింది. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్న కారణంగా ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై జట్టును రద్దు చేస్తే ఏం జరుగుతుంది?’ అని బెంచ్ ప్రశ్నించింది. ఇండియా సిమెంట్స్‌కు చెందిన షేర్‌హోల్డర్స్, డెరైక్టర్ల వివరాలను అందించాలని ఆదేశించింది. మరోవైపు గురునాథ్ మెయ్యప్పన్‌ను సీఎస్‌కే టీమ్ అధికారిగా ఇండియా సిమెంట్స్ అంగీకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా పడింది.
చెన్నై జట్టును ఎందుకు రద్దు చేయకూడదు?
Published Fri, Nov 28 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement
Advertisement