అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా
బెంగళూరు: అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా పడింది. ఇక్కడి ప్రత్యేక కోర్టులో సోమవారం వాదనలు మొదలైన వెంటనే జయలలితపై తాను కేసు దాఖలు చేశానని, అందువల్ల ఈ కేసును వాదించేందుకు తనకు అనుమతివ్వాలంటూ న్యాయమూర్తి పి.ఆర్.కుమారస్వామిని సుబ్రహ్మణ్యస్వామి కోరారు.
ఈ విషయాన్ని రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. అనంతరం జయలలిత తరుఫు న్యాయవాది పి.కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు.