
ఆదిలాబాద్‌టౌన్: సమత కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటిషన్‌పై నిందితుల తరపు లాయర్ రహీం, పీపీ రమణారెడ్డి ఇద్దరు తమ తమ వాదనలు వినిపించారు. చార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ వేయడం నిబంధనలకు వ్యతిరేకమని, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పీపీ రమణారెడ్డి వాదనలు వినిపించారు. దీంతో న్యాయవాది రహీం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సోమవారం నుంచి షెడ్యూల్ ప్రారంభించాలని ఆదేశించింది. ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలంది. చార్జ్‌షీట్‌లో పొందుపర్చిన 44 మంది సాక్షులను రోజువారీగా కోర్టు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment