సాక్షి ప్రతినిధి, విజయనగరం : ట్రక్‌షీట్‌ల మాయాజాలంైపై కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ రామారావును ఆదేశించారు. సీరియల్ నంబర్లు లేకుండా ట్రక్‌షీటులను ఎలా ముద్రించారని, రైసు మిల్లర్ల చేతికి ఎలా వెళ్లాయో నిగ్గుతేల్చాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్‌షీటు మిల్లర్ల చేతికి వెళ్లాయని, వీటిని ఆధారంగా చేసుకుని పలువురు మిల్లర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, రూ.కోట్లలోనే కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ‘ట్రిక్’షీట్‌లు అనే శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
దీన్ని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సీఎస్‌డీటీల చేత విచారణ జరిపించి, నివేదిక ఇవ్వాలని జేసీని ఆదేశించారు. అలాగే, మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యమెంత ? ఉన్న నిల్వలెంత? కస్టమ్ మిల్లింగ్ ఎంత? తదితర వాటిపై కూడా విచారణ జరపాలని ఆదేశించారు.
ట్రక్‌షీట్‌ల మాయాజాలంపై విచారణకు ఆదేశం
Published Thu, Feb 26 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement