నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులలో గత నెల 7వ తేదీన జరిగిన తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై బుధవా రం ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో సిట్ (ప్రత్యేక విచారణ బృందం) విచారణ జరిపింది.
ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులలో గత నెల 7వ తేదీన జరిగిన తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై బుధవా రం ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో సిట్ (ప్రత్యేక విచారణ బృందం) విచారణ జరిపింది. ఉదయం 7.30 గంటలకే సిట్ బృందం సభ్యులు ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు వివిధ వాహనాల్లో చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న ఎన్‌కౌంటర్ జరిగిన బస్సు ను వారు సుమారు మూడు గంటల పాటు పరిశీలించారు.
మధ్యాహ్నం తిరిగిహైదరాబాద్‌కు వెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లోకి ఇతరులను అనుమతించలేదు. విచారణ జరిపిన వారిలో సిట్ బృందం ఐజీ సందీప్ శాండీల్యా, ఎస్పీ షానవాజ్‌ఖాసీం, మాదాపూర్ ఐజీ రవికుమార్ ఉన్నారు.