
రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే సోమవారం విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి సీ1 ఏజెన్సీని తప్పిస్తూ మరో సంస్థకు అప్పగించే విషయమై నిర్ణయాన్ని రేపు హైకోర్టు వెల్లడించనుంది.