నిర్భయ కేసు విచారణ డిసెంబర్ 5కు వాయిదా
ఢిల్లీ: నిర్భయ కేసు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. నిందితులు ముఖేష్, రాంసింగ్‌ల మొబైల్ లొకేషన్‌లు వేరు వేరుగా ఉన్నాయని అమికస్ క్యూరీ కోర్టుకు వెల్లడించింది. రాంసింగ్ ఘోరానికి పాల్పడుతున్నప్పుడు ముఖేష్ అక్కడ లేడని శనివారం విచారణలో సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ తెలిపింది.
అలాగే ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలపై అమికస్ క్యూరీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.