సీఐడీ ఇన్‌స్పెక్టర్పై నిర్భయ కేసు | nirbhaya case filed on cid inspector dayaker reddy | Sakshi
Sakshi News home page

సీఐడీ ఇన్‌స్పెక్టర్పై నిర్భయ కేసు

Published Sun, Apr 3 2016 4:02 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

nirbhaya case filed on cid inspector dayaker reddy

హైదరాబాద్: కరీంనగర్ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దయాకర్‌రెడ్డిపై  పోలీసులు ఆదివారం నిర్భయ కేసు నమోదు చేశారు. కరీంనగర్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఒక మహిళను దయాకర్‌రెడ్డి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళకు వాట్సప్, ఫోన్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీంతో పాటు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ మహిళా పోలీస్‌ కూడా తనపై దయాకర్ రెడ్డి  లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్వయంగా  ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై నిర్భయ కేసు నమోదు చేసినట్ల పోలీసు అధికారులు తెలిపారు. మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో దయాకరరెడ్డి విచారణాధికారిగా ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement