
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా సేవ చేస్తామంటూ రాజకీయ క్షేత్రంలో ఉన్న దాదాపు 1,700 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నాయి. వీరంతా దాదాపు 3,045 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది.
కాగా, ఈ కేసులు ఎదుర్కొంటున్నవారిలో ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఉన్నారని, ఆ తర్వాత తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ వరుసగా ఉన్నట్లు కేంద్ర సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 248మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు, బిహార్, బెంగాల్‌లో వరుసగా 178, 144, 139 మంది ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 100 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్యేపై కూడా వివిధ నేరాల్లో పాలుపంచుకున్నట్లు, స్వయంగా చేసినట్లు కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment