MPs and MLAs
-
కాసేపట్లో ప్రధానితో టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూప్రింట్ గురించి భేటీలో ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయంటున్నారు.ఢిల్లీలో టీబీజేపీ నేతలు ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ బలోపేతంపై చర్చించబోతున్నామన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులివ్వడం లేదు. రేవంత్ ప్రభుత్వం పక్షపాతాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని వారు తెలిపారు. -
Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది! ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105(2), ఆరి్టకల్ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం. ‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క. అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ... జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టారు. ఆరి్టకల్ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది. ఏమిటీ పీవీ కేసు... 1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్ 105(2), ఆర్టికల్ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది. అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన జేఎంఎం ముడుపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు లంచాల కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు లంచాల కేసులో ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగినా విచారణ ఎదుర్కోవాల్సిందే లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ఓటు వేయడం తప్పే, విచారణ ఎదుర్కోవాల్సిందే చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఎందుకుండాలి? 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జిల తీర్పును కొట్టేసిన ధర్మాసనం ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడటం, లంచాలు తీసుకోవడం పార్లమెంట్ వ్యవస్ధ పనితీరును నాశనం చేస్తుంది ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో రాజ్యాంగ రక్షణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ధర్మాసనం.. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగితే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. Seven-judge Constitution bench of the Supreme Court rules that an MP or MLA can't claim immunity from prosecution on a charge of bribery in connection with the vote/speech in the Parliament/ Legislative Assembly. Supreme Court’s seven-judge bench in its unanimous view overruled… pic.twitter.com/xJ4MRWvpoO — ANI (@ANI) March 4, 2024 ఇదే సమయంలో 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు కేసులో నిందితులపై చర్యలు తీసుకోకుండా.. అప్పటి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
‘ప్రగతి’సభకు జనహోరు
సాక్షి యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి జనం భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వారం రోజులుగా శ్రమించి నిర్దేశించిన లక్ష్యానికి మించి జనసమీకరణ చేశారు. జిల్లా నుంచి మొత్తం 1,392 వాహనాల్లో 79,750 మంది సభకు వెళ్లారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు వాహనాల ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ప్రభుత్వవిప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి బైక్‌ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భువనగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద కొద్ది సేపు బైక్‌పై ప్రయాణించింది.అలాగే భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వాహన శ్రేణిని ప్రారంభించారు. సభకు వెళ్లినవారు ఇలా.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు ఇ తర మండలాల నుంచి 1,392 వాహనాల్లో 79, 750 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లా రు. ఆలేరు నియోజకవర్గం నుంచి 377 వాహనా ల్లో 30వేలు, భువనగిరి నియోజకవర్గం నుంచి 454 వాహనాల్లో 30,450వేల మంది, సంస్థాన్ నారా యణపురం, చౌటుప్పల్, రామన్నపేట, మో త్కూ రు, అడ్డగూడురు మండలాల నుంచి 561 వాహనాల్లో 19,300 మంది సభకు తరలివెళ్లారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను సైతం సభకు జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ఆదివా రం బోనాలు, శుభాకార్యలు, సొంత పనుల కో సం వెళ్లేవారికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్సుల కో సం బస్టాండ్లలో నిరీక్షించారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు, యాదగిరిగుట్ట బస్టాండ్లలో బస్సులు లేక వెలవెలబో యాయి. చాలా మంది ప్రయాణికులు బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిం చారు. హైవేలపై వాహనాల రద్దీ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు జాతీయ రహదారులన్నీ గులాబీ శోభను సంతరించుకున్నాయి. సభకు వెళ్లే వాహనాలతో ర ద్దీగా మారాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీం నగర్ జిల్లాల వాహనాలు ఆలేరు, భువనగిరి, బీ బీనగర్‌ల మీదుగా వెళ్లడంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల వాహనాలు చౌటుప్పల్ మీదుగా వెళ్లడంతో పంతంగి వద్ద ఉన్న టోల్‌ప్లాజా రద్దీ ఏర్పడింది. రహదారుల వెంట ఉన్న వైన్స్లలో కోనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో ఖాళీ అయిపోయాయి. పార్టీ శ్రేణులు తమ వెంట తె చ్చుకున్న భోజనాన్ని రోడ్ల వెంట వాహనాలను ఆపి తిన్నారు. పోలీస్‌యంత్రాంగం పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. -
మొక్కుబడి దీక్ష..!
సాక్షి,విశాఖపట్నం/తాటిచెట్లపాలెం/డాబాగార్డెన్స్: అంతన్నారు.. ఇంతన్నారు.. రైల్వే జోన్ కోసం చేపట్టే నిరసన దీక్షకు తమ పార్టీ ఎంపీలంతా వచ్చి వాలిపోతారన్నారు. నగరం, జిల్లా వ్యాప్తంగా ఏకంగా 35 వేల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టారు. జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ముందస్తు ఏర్పాట్లు చేయమని పోలీసులకు హుకుం జారీ చేశారు. తీరా ఏమయింది? అనుకున్న సంఖ్యలో కనీసం పదో వంతు జనం కూడా హాజరు కాలేదు. దాదాపు అరడజను మంది ఎంపీలూ డుమ్మా కొట్టారు. రైల్వే జోన్ రాదంటూ వెటకారపు వ్యాఖ్యల నేపథ్యంలో హడావుడిగా, అట్టహాసంగా చేపట్టిన నిరసన దీక్ష అరకొర జనంతో తుస్సుమంది. ఆ పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నింపింది. ఉదయం తొమ్మిది గంటలకు దీక్ష ప్రారంభమయ్యే సమయం నుంచి దీక్ష ముగిసే దాకా (సాయంత్రం 5 గంటల వరకు) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, తెచ్చిన జనం పలచగానే కనిపించారు. దీంతో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు మాట్లాడే సమయానికి కుర్చీల్లో చాలావరకు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ వాళ్లంతా వాటినుద్దేశించే ప్రసంగాలు కొనసాగించారు. ప్రధాన టెంట్‌తో పాటు దానికి ముందు మరో రెండు టెంట్లు వేశారు. వాటిల్లో కూర్చునే వారు కరవవ్వడంతో అక్కడ వేసిన కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్పించారు. కుర్చీల్లో కూర్చోవాలంటూ వేదికపై ఉన్న వారు పదే పదే మైకుల్లో అభ్యర్థించినా ఫలితం కనిపించలేదు. జనాన్ని భారీగా తరలించాలని పార్టీ శ్రేణులకు నేతలు ఆదేశాలిచ్చారు. దీంతో వారిని రప్పించడానికి వాహనాలూ సమకూర్చారు. అయినా దీక్షకు రావడానికి జనం ఆసక్తి చూపలేదని ఒక సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖకు రైల్వే జోన్ ఆవశ్యకతపై విశాఖ పశ్చిమ, దక్షిణ ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు మాత్రమే మాట్లాడారు. పలువురు ఎంపీలు, ఒకరిద్దరు మంత్రులు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులు విడుదలలో కేంద్రం చూపుతున్న వివక్షను ప్రస్తావించారు. ప్రధాన అంశమైన రైల్వే జోన్ గురించి నామమాత్రంగానే ప్రసంగించారు. విసిగించిన జేసీ ప్రసంగం వివాదాస్పద నాయకునిగా పేరున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రసంగం సభికులను బాగా విసిగించింది. దాదాపు గంట (58 నిమిషాలు) సేపు సా...గిన ఆయన ప్రసంగమంతా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషించడానికి, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే సరిపోయింది. తన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండడంతో పలువురు విస్తుపోయారు. ఇక మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చాలా క్లుప్తంగా, పొడిపొడిగా మాట్లాడి మూడు నిమిషాల్లో ముగించేశారు. ఇక ఒకరంటే ఒకరు పొసగని జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు దీక్ష ప్రారంభ సమయానికి వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయారు. విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకల్లో వేర్వేరు చోట్ల పాల్గొనడానికి హడావుడిగా నిష్క్రమించారు. సాయంత్రం 5 గంటలకు దీక్షలో పాల్గొన్న వారికి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్షా శిబిరంలో ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బా బు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గో విందు, పల్లా శ్రీనివాస్, గణబాబు, కేఎస్ఎన్ రా జు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ పాల్గొన్నారు. ఎండలోనే కార్యకర్తలు దీక్షలో నేతలకీ అన్ని సౌకర్యాలు కల్పించారు. పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలను మాత్రం విస్మరించారు. కుర్చీలైతే వేశారు..కానీ టెంట్లు వేయకపోవడంతో కార్యకర్తలు ఎండలో ఇమడలేక..నేతల ప్రసంగాలు వినలేక నెమ్మదిగా జారుకున్నారు. ఉద్యోగులు.. విద్యార్థులకు కష్టాలు అధికారం మాది.. పోలీసులు మావోళ్లు అన్నట్టుగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. నడిరోడ్డుపై దీక్ష చేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వరు.కానీ టీడీపీ దీక్షకు పోలీసులు ఎలా అనుమతులిచ్చారో వారికే తెలియాలి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో నడిరోడ్డుపై దీక్ష చేపడుతుంటే పోలీసులు రాచమర్యాదలు చేసినట్టు కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ మీదుగా వెళ్లే వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి అవస్థలు పడ్డారు. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. -
1,700 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా సేవ చేస్తామంటూ రాజకీయ క్షేత్రంలో ఉన్న దాదాపు 1,700 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నాయి. వీరంతా దాదాపు 3,045 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. కాగా, ఈ కేసులు ఎదుర్కొంటున్నవారిలో ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఉన్నారని, ఆ తర్వాత తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్ వరుసగా ఉన్నట్లు కేంద్ర సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 248మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు, బిహార్, బెంగాల్లో వరుసగా 178, 144, 139 మంది ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 100 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్యేపై కూడా వివిధ నేరాల్లో పాలుపంచుకున్నట్లు, స్వయంగా చేసినట్లు కేసులు ఉన్నాయి. -
అధ్యక్షా.. అనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే
కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు అధ్యక్షా అని మైకు పట్టుకుని కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళం విప్పాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే. మునిసిపల్ ఎన్నికలు జరిగిన 43 రోజుల వరకు ఫలితాల విషయంలో నిరీక్షించిన కౌన్సిలర్లకు పదవీ స్వీకార ప్రమాణ విషయంలోనూ జాప్యం తప్పడం లేదు. వాస్తవానికి మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే న్యాయపరమైన ఇబ్బం దు లు తదితర కారణాల నేపథ్యంలో ఈ ఎన్నిక జూన్ ఒకటి, రెండు తేదీ ల్లోగాని గాని జరిగే అవకాశం లేదు. మున్సిపల్ కౌన్సిళ్లలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. అలాంటి కౌన్సిళ్లలో వీరి ఓటు ఒకో సందర్భంలో కీలకంగా మారుతుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుతం మనకు ఎమ్మెల్యేలు లేరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైతేనే మనకు కొత్త ఎమ్మెల్యేలు వస్తారు. ఆ తర్వాత వారి ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు ఉం టాయి. అలాగే ఎంపీల పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాల చట్రంలో మునిసిపల్ ైచె ర్మన్ , వైస్ చైర్మన్ ఎంపికల వ్యవహారం పడకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలోగాని కొత్త కౌన్సిలర్లు అధ్యక్షా అనడానికి వీలు లేకుండా పోయింది.