ర్యాలీని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
సాక్షి యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి జనం భారీగా తరలివెళ్లారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వారం రోజులుగా శ్రమించి నిర్దేశించిన లక్ష్యానికి మించి జనసమీకరణ చేశారు. జిల్లా నుంచి మొత్తం 1,392 వాహనాల్లో 79,750 మంది సభకు వెళ్లారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు వాహనాల ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ప్రభుత్వవిప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి బైక్‌ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భువనగిరి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద కొద్ది సేపు బైక్‌పై ప్రయాణించింది.అలాగే భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వాహన శ్రేణిని ప్రారంభించారు.
సభకు వెళ్లినవారు ఇలా..
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు ఇ తర మండలాల నుంచి 1,392 వాహనాల్లో 79, 750 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లా రు. ఆలేరు నియోజకవర్గం నుంచి 377 వాహనా ల్లో 30వేలు, భువనగిరి నియోజకవర్గం నుంచి 454 వాహనాల్లో 30,450వేల మంది, సంస్థాన్ నారా యణపురం, చౌటుప్పల్, రామన్నపేట, మో త్కూ రు, అడ్డగూడురు మండలాల నుంచి 561 వాహనాల్లో 19,300 మంది సభకు తరలివెళ్లారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను సైతం సభకు జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ఆదివా రం బోనాలు, శుభాకార్యలు, సొంత పనుల కో సం వెళ్లేవారికి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్సుల కో సం బస్టాండ్లలో నిరీక్షించారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు, యాదగిరిగుట్ట బస్టాండ్లలో బస్సులు లేక వెలవెలబో యాయి. చాలా మంది ప్రయాణికులు బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిం చారు.
హైవేలపై వాహనాల రద్దీ
జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు జాతీయ రహదారులన్నీ గులాబీ శోభను సంతరించుకున్నాయి. సభకు వెళ్లే వాహనాలతో ర ద్దీగా మారాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీం నగర్ జిల్లాల వాహనాలు ఆలేరు, భువనగిరి, బీ బీనగర్‌ల మీదుగా వెళ్లడంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల వాహనాలు చౌటుప్పల్ మీదుగా వెళ్లడంతో పంతంగి వద్ద ఉన్న టోల్‌ప్లాజా రద్దీ ఏర్పడింది. రహదారుల వెంట ఉన్న వైన్స్‌లలో కోనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో ఖాళీ అయిపోయాయి. పార్టీ శ్రేణులు తమ వెంట తె చ్చుకున్న భోజనాన్ని రోడ్ల వెంట వాహనాలను ఆపి తిన్నారు. పోలీస్‌యంత్రాంగం పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment