సాక్షి, హైదరాబాద్: బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూప్రింట్ గురించి భేటీలో ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయంటున్నారు.
ఢిల్లీలో టీబీజేపీ నేతలు ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ బలోపేతంపై చర్చించబోతున్నామన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులివ్వడం లేదు. రేవంత్ ప్రభుత్వం పక్షపాతాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment