సలహాదారులకు కేబినేట్ హోదాపై విచారణ
Published Tue, Jan 31 2017 4:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. కేబినెట్ హోదాలో నియమించిన వారికి ఎలాంటి అర్హతలు లేవని , దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వీరి అధికారాలు అర్హతలు తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు.
Advertisement
Advertisement