హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ నెలాఖరు కల్లా నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఎప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే.
శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ
Published Mon, Dec 14 2015 5:20 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM