Seshachalam
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
చంద్రగిరి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్సై భాస్కర్ బృందం కూంబింగ్ నిర్వహించింది. ఆదివారం తెల్లవారుజామున కల్యాణి డ్యామ్ ఎగువ ప్రాంతమైన శేషాచలం అడవుల్లో తనిఖీలు చేపట్టారు. పుల్లయ్యగారి పల్లెగుట్ట వద్ద 10 మంది తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను పక్కన పెట్టి సేదతీరుతుండగా టాస్క్‌ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టింది. దీంతో కూలీలు చేతికందిన రాళ్లు తీసుకొని టాస్క్‌ఫోర్స్ బృందంపై దాడి చేస్తూ పారిపోయారు. వారిలో ఒకరిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా పోలార్ తాలూకా జావాధిమలైకు చెందిన అలగేశన్‌గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 9 ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్య, ఏబీవో కోదండ, హెడ్‌కానిస్టేబుల్ మోహన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
శేషాచలంలో ఎర్ర స్మగ్లర్లు..!
రాజంపేట : రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరికివేత ఆగడం లేదు. ఓ వైపు కూంబింగ్ కొనసాగుతున్నా ..మరోవైపు తమిళ కూలీలు దట్టమైన అటవీ ప్రాంతంలో మాటువేసి చెట్లను యథేచ్చగా నరికివేస్తున్నారు. ఇప్పుడు శేషాచలంలో స్మగ్లర్లు, కూలీలు జొరబడటంతో పోలీసు, అటవీశాఖలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా 200కిపైగా దుంగలు లభ్యమైనట్లు ప్రచారం ఊపందుకుంది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలిలో కదలికలు ఈనెల 6న రైల్వేకడూరు ఎస్ఐ భక్తవత్సలం మధ్యాహ్నం 2గంటల సమయంలో కోడూరు మండల బాలుపల్లె రిజర్వుఫారెస్టు వాగేటికోన చెరువు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా అక్కడ గుంపులుగా ఎరచ్రదనం దుంగలను మోసుకొస్తున్న స్మగ్లర్లు, కూలీలు ఒక్కసారిగా కేకలువేస్తూ, రాళ్లు, కట్టెలు, గొడ్డల్లతో పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు వారిని చుట్టుముట్టి చాకచాక్యంగా దాడి నుంచి తప్పించుకొని అందులో 11మంది పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలను (375.3కేజీల బరువు), రాళ్లు, కట్టెలు, గొడ్డలను స్వా«ధీనం చేసుకున్నారు. ఓబులవారిపల్లెలో ఇలా.. పారిపోయిన స్మగ్లర్ల గురించి ఎస్ఐ భక్తవత్సలం ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ రాజేంద్ర ఆధ్వర్యంలో ఓబులవారిపల్లె ఎస్ఐ ప్రదీప్‌నాయుడు తమ పోలీసు సిబ్బందితో ఈనెల 6న ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తుండగా, అక్కడ కొంతమంది దుంగలను మోసుకొస్తున్నారు. పోలీసులపై ఎదురుదాడికి దిగారు. వారిని ఎదుర్కొని పది మందిని పట్టుకొని వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలను (354.5కేజీలు గల బరువు), రాళ్లు, కట్టెలు, గొడ్డల్లను స్వాధీనం చేసుకున్నారు. చిట్వేలి పరిధిలో.. బాలిరెడ్డిపల్లె అటవీ ప్రాంతంలో పారిపోయిన మిగిలిన స్మగ్లర్లు, కూలీలపై నిఘా ఉంచడంతో ఈనెల 7న తెల్లవారుజామున చిట్వేలి పీఎస్ ఇన్చార్జి వెంకటేశ్వర్లు బృందాలుగా ఏర్పడ్డారు. చెర్లోపల్లె గ్రామం దగ్గరకు వెళ్లేసరికి అక్కడ కొంతమంది గుంపులుగా ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్నారు. పోలీసులకు తారసపడటంతో ఎదురుతిరిగే ప్రయత్నం చేశారు. ఈ బృందంలో పది మందిని పట్టుకున్నారు. వారి నుంచి 364కేజీల బరువు కలిగిన పది దుంగలను స్వాధీనం చేస్తున్నారు. డీఎస్పీ మాటల్లో.. రైల్వేకోడూరు, ఓబులవారపల్లె, చిట్వేలి పీఎస్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతంలో 50 మంది స్మగర్లు, కూలీలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రాజేంద్ర ఇక్కడి విలేకర్లకు తెలిపారు. 31మందిని అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 1053.5 కేజీల బరువు గల 31 దుంగలను స్వాధీనం చేస్తుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ.21లక్షలని చెబుతున్నప్పటికీ, బయటిమార్కెట్ ను బట్టి రూ.2కోట్లలోపు విలువ ఉంటుందని అంచనా. నిందితుల సమాచారం మేరకు ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లు పెద్దఎత్తున కూలీలను సేకరించుకొని కోడూరు, బాలుపల్లె, ఓబులవారిపల్లె, చిట్వేలి, రాజంపేట, రాయచోటి పరిసర ప్రాంతాల అడవిలోకి కూలీలను పంపి, దుంగలను సేకరించుకొని వాటిని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు అక్రమరవాణా చేసి కోట్ల రూపాయిలు అక్రమంగా సంపాదిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. కీపర్సన్, మేస్త్రీలు, కూలీను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ప్రతిభ చూపినవారిలో సీఐ సాయినాథ్, ఎస్ఐలు భక్తవత్సలం, పీ.వెంకటేశ్వర్లు, ప్రదీప్‌నాయుడు, రూరల్ సీఐ మురళీ, ఎస్ఐ మహేష్‌నాయుడు, పోలీసుసిబ్బంది, పోలీసు బలగాలను అధికారులు అభినందించారు. ప్రోత్సాహక రివార్డుల కోసం ఎస్పీ అట్టాడబాబూజీకి ప్రతిపాదనలు పంపామన్నారు. -
శేషాచలం వీడి..అన్నదాతపై దాడి..
- ఎర్ర స్మగ్లర్ల జోరుతో ఏనుగులకు ఆటంకం - స్వార్థంతో విచ్చలవిడిగా చెట్ల నరికివేత - గజరాజులు ప్రయాణించే దారుల్లో మార్పులు - గత్యంతరం లేక పొలాల్లోకి చొరబాటు - ఆహారం కోసం పంటనష్టం - బెంబేలెత్తుతున్న రైతన్నలు అడవిలోని ఏనుగులు జనారణ్యంలోకి వస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వీటివల్ల నష్టాలను చవిచూస్తున్నారు. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తుండటంతో ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజాగా భాకరాపేట పరిసరాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం సృష్టించాయి. సాక్షి, తిరుపతి: జిల్లాలో ఏనుగుల దాడి పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఇవి తమ ఉనికిని చాటుతూ రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల పరిధిలో 40వేల చ.కిమీ. మేర శేషాచలం విస్తరించి ఉంది. ఎర్రచందనం ఈ దట్టమైన అడవి ప్రత్యేకం. అదే ఇప్పుడు రైతుల పా లిట శాపమైంది. దేశంలో మరెక్క డాలేని విలువైన ఎర్రచందనం సం పద ఈఅడవుల్లో దొరుకుతుంది. కోట్లు విలువచేసే ఎర్రచందనంపై అక్రమార్కుల కన్నుపడింది. 2012 వరకు 4, 5 కి.మీ పరిధిలోనే స్థానికులు కొందరు ఒకటీ అరా ఎర్రచందనం చెట్లను నరికి అమ్మి సొమ్ముచేసుకునే వారు. తరువాత స్మగ్లర్లు చొరబడ్డారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన అనేక మంది దొంగలు శేషాచలం బాట పట్టారు. అడవిలోని ఎర్రచందనాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు. వీరి ప్రవేశంతో శేషాచలంలో ఏనుగులకు దారిలేకుండా చేశారు. అదెలాగంటే.. 1992లో శేషాచలం అడవుల్లో 15 ఏనుగులు ఉండేవి. వీటితో పాటు కేరళ, తమిళనాడు సరిహద్దుల నుంచి మరికొన్ని ప్రవేశించాయి. కౌండిన్య అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి కొరత ఏర్పడటంతో కుప్పం, పలమనేరు పరిధిలో పంటపొలాల్లో ప్రవేశించి దాడులు చేయటం మొదలుపెట్టాయి. మరో మదపుటేనుగు మనుషులపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని అనంతపురం జిల్లా కదిరి అడవుల మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లికి చేరుకున్నాయి. అక్కడ ఉన్న మరో 15 ఏనుగులతో కేరళ, తమిళనాడు నుంచి మరి కొన్ని గజరాజులు గుంపుగా ఏర్పడ్డాయి. ఈ ఏనుగులు శేషాచలం అడవుల్లో స్వేచ్చగా తిరిగేవి. 2012 నుంచి ఎర్రచందనం దొంగలు శేషాచలం అడవిలోకి అడుగుపెట్టారు. వీరి నేతృత్వంలో తమిళనాడుకు చెందిన కూలీలు ఎర్రదుంగలను తరలించడం కోసం అడవుల్లో వెదురు మొక్కలు, ఇతరత్రా వృక్షాలను నరికి వేయటం మొదలుపెట్టారు. తమ ఆహారమైన వెదురు మొక్కలు నరికివేస్తుండటం, దారుల్లో మార్పురావడం ఏనుగులు పసిగట్టాయి. జనారణ్యంలోకి గజరాజులు.. ఎర్రదొంగల చర్యలతో ఏనుగులకు ఇటు ఆహారం కొరత... అటు ప్రాణభయం మొదలైంది. దీంతో జనారణ్యంలోకి ప్రవేశించటం మొదలుపెట్టాయి. కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లి మండలాల పరిధిలోకి చేరుకున్నాయి. రెండునెలల క్రితం వరకు ఏనుగులు బీభత్సం సష్టిం చిన విషయం తెలిసిందే. పలమనేరు అటవీ పరిధిలోని బైరెడ్డిపల్లి, వీకోట పరిసర గ్రామాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. తాజాగా ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం బీభత్సం చేశాయి. వరి, అరటి, మామిడి పంటలను నాశనం చేశాయి. విద్యుత్ మోటార్లను పీకి పడేశాయి. లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. స్మగ్లర్లను అరికట్టకపోవటంతో అటు అడవిలోని ఎర్రచందనం సంపదతో పాటు ఇటు రైతులు కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు కూడా కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శేషాచలంలో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు మార్గం లోని 22వ మలుపు వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి. దట్టమైన పొగ ఎగిసిపడటంతో గమనిం చిన భక్తులు టీటీడీ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందిం చారు. అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కార్చిచ్చు వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులు ఎండిపోయి, రాపిడి వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. -
శేషాచలం అడవిలో కార్చిచ్చు
-
200 ఏళ్లకు సరిపడా శ్రీగంధం సిద్ధం
– టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో – భక్తులకు త్వరలో వృక్షప్రసాదం సాక్షి,తిరుమల: శేషాచలంలో ప్రస్తుతం 12 హెక్టార్లలో శ్రీగంధం వనం అభివృద్ధి చేశామని, ఈ ఏడాది సెప్టెంబరుకు మొత్తం 100 హెక్టార్లకు విస్తరించి శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలకు మరో రెండు వందల సంవత్సరాలకు సరిపడా శ్రీగంధం సిద్ధం చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి పారువేట మండపం వద్ద ‘‘వనం–మనం’’ కార్యక్రమంలో భాగంగా శ్రీగంధం మొక్కలు నాటారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి అభిషేకం, వసంతోత్సవం స్నపన తిరుమంజనాది కైంకర్యాల్లో ఏటా సుమారు 500 కిలోల శ్రీగంధం వాడుతున్నామని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే 2013 నుంచి శ్రీగంధం వనాన్ని టీటీడీనే సొంతంగా పెంచుకునే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. టీటీడీ నర్సరీల్లో మొత్తం 10 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచామన్నారు. వీటిలో రెండు లక్షల మొక్కల్ని ఉచితంగా రైతులకు , ఏపీ అటవీశాఖకు పంపిణీ చేశామని, మరో 8 లక్షల మొక్కలు ముందుకొచ్చే సంస్థలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే వృక్షప్రసాదం కింద భక్తులకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. -
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగర్లను గురువారం అర్ధరాత్రి అటవీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు స్మగ్లరు పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం టాస్క్‌ఫోర్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. -
తిరుమల శేషాచల అడవుల్లో అగ్ని ప్రమాదం
తిరుమలలో శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జపాలికి నడచి వెళ్లే మార్గంలో గౌతమీ వనం వద్ద మొదలైన మంటలు పక్కనున్న ప్రాంతాలకు విస్తరించాయి. సమాచారం అందుకున్నఅటవీ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. సుమారు మూడు హెక్టార్ల ప్రాంతంలో విలువైన వృక్ష సంపద బుగ్గిపాలైంది. -
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
-
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ నెలాఖరు కల్లా నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఎప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. -
శేషాచల అడవుల్లో కూంబింగ్
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని బొమ్మాజి కొండ వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘురామ్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులకు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అధికారులను చూసిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పరారైన కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
' శేషాచలం ' విచారణ మూడు వారాలకు వాయిదా
-
' శేషాచలం ' విచారణ మూడు వారాలకు వాయిదా
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో జరిగిన 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. శేషాచలం ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించిన నివేదికను సోమవారం సిట్ అధికారులు హైకోర్టుకు అందజేశారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ లోఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. కాగా, సిట్ విచారణ సరిగా లేదని.. ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తు కొనసాగుతోందని బాధితుల తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిట్ విచారణపై నమ్మకం లేదని.. శేషాచలం ఎన్ కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారణ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. దీంతో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను రీఎగ్జామ్ చేయాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. తమిళనాడులో సాక్షుల స్వగ్రామాలకు వెళ్లి అడ్వకేట్ల సమక్షంలో స్టేట్ మెంట్ తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. అవసరమైతే తమిళనాడు పోలీసులను రక్షణగా తీసుకువెళ్లాలని సూచించింది. -
శేషాచల అడవుల్లో చెలరేగిన మంటలు
-
ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన సిట్ బృందం
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోని చీకటీగల కోన, చచ్చినోడుబండ వద్ద ఎన్కౌంటర్ జరిగిన స్థలాలను గురువారం సిట్(స్పెషల్ ఇన్విస్టిగేషన్) బృందం పరిశీలించింది. గురువారం ఉదయం 11.30 గంటలకు సిట్ బృందం శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకుంది. వాహనాలు పోవడానికి వీలు లేకపోవడంతో సుమారు 15 కిలోమీటర్లు సిట్బృందం కాలినడకన ఘటనా స్థలం చేరుకుంది. మృతదేహాలు ఏవిధంగా పడి ఉన్నాయి.. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మృతదేహాలు పడి ఉన్నాయి.. ఎంతమంది టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్పులు జరిపారు. కూలీల వద్ద ఉన్న ఆయుధాలు ఎక్కడ లభించాయి.. వంటి అంశాలపై స్థానిక అధికారులను ఆరా తీశారు. అనంతరం ఘటనా స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎక్కడైనా భారీ వృక్షాలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఈసందర్భంగా సిట్ చైర్మన్ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు 8మందితో కూడిన బృందం శేషాచలంలోని చీకటీగల కోన, చచ్చినోడు బండ ఎన్కౌంటర్ ఘటనా స్థలాలను సందర్శించిందన్నారు. ఈకేసుకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాధ్ జెట్టి నుంచి నివేదిక తీసుకున్నామన్నారు. ఘటన జరిగిన తీరుపై స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మరో రెండు నెలల కాల వ్యవధిలో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందిస్తామన్నారు. తిరుపతి పోలీసుల నుంచి మరికొన్ని నివేదికలు అందాల్సి ఉందన్నారు. అవి అందిన తర్వాత తుది నివేదికను హైకోర్టుకు అందజేస్తామని తెలిపారు. సిట్ బృందం రవిశంకర్ అయ్యన్నార్తో పాటు సభ్యులు డీఐజీ రమణకుమార్, పాలరాజు, చంద్రశేఖర్, యుగంధర్ బాబు, రఘు, మదుసూదన్, చంద్రశేఖర్ వచ్చారు. వీరితో పాటు తిరుపతి వెస్టు డీఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సీఐ శివప్రసాద్, ఎస్ఐ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా ఈ బృందంలో సభ్యుడైన సీబీసీఐడీ డీఎస్పీ యుగంధర్‌బాబు తిరుగు ప్రయాణంలో ఎండ తీవ్రత వల్ల కొంత అస్వస్థతకు గురయ్యారు. చంద్రగిరి సీఐ శివప్రసాద్ వ్యయప్రయాసాలతో శేషాచలంలోకి ద్విచక్ర వాహనాన్ని తెప్పించి సురేంద్రబాబును క్షేమంగా గమ్యానికి చేరవేశారు. -
రక్తచందనం
శేషాచలంలో భారీ ఎన్కౌంటర్ 20 మంది ఎర్రకూలీల హతం రాష్ట్రంలోనే భారీ ఎన్కౌంటర్ స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజాసంఘాల ఆగ్రహం తమిళనాడుకు ఆగిన బస్సు సర్వీసులు సాక్షిప్రతినిధి, తిరుపతి/ క్రైం: శేషాచలం అడవుల్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది ఎర్రకూలీలు హతమయ్యారు. వందలాది మంది తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. వారికోసం వేట కొనసాగుతోంది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలో వందలాది మంది ఎర్రకూలీలు అడవుల్లోకి ప్రవేశించారనే పక్కా సమాచారంతో అటవీ శాఖ, రెండు టాస్క్ఫోర్స్ృబందాలు సోమవారం రాత్రి 7 గంటలకు కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున ఎర్రకూలీలు పోలీసులకు ఎదురపడ్డారు. ఎర్రకూలీలు రాళ్లు, గొడ్డళ్లతో పోలీసులపై దాడి చేయడంతో ఆత్మరక్షణార్థం జరిగిన పోలీస్ కాల్పుల్లో 20 మంది కూలీలు చని పోయారు. పారిపోయిన కూలీల కోసం పోలీస్ బల గాలు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు ఎన్కౌంటర్ విషయం తెలిసిన వెంటనే రేంజ్ డీఐజీ బాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వృుతదేహాలను పరిశీలించారు. ఘటనపై కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమించిన డీఆర్వో విజయచంద్ర, ఆర్డీవో వీరబ్రహ్మం సైతం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించాక వృుతదేహాలను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రుయాస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో బుధవారం ఉదయం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. కూలీల దాడిలో గాయపడిన పోలీసులను ఉదయమే రుయాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ప్రజా సంఘాల ఆగ్రహం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణిస్తున్నాయి. వృుతిచెందిన వారంతా తమిళనాడుకు చెందిన వారే కావడంతో అక్కడ కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లే 80 బస్సును నిలిపివేశారు. ఉనికిని చాటుకోవడానికే ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రత్యేకంగా డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో భయం నెలకొల్పేందుకు భారీ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. రోజూ వందల సంఖ్యలో ఎర్రకూలీలు శేషాచల అడవుల్లో ప్రవేశిస్తుండడం, వారిని అడ్డుకునేంత సిబ్బంది లేకపోవడంతో పక్కా ప్రణాళికతో ఈ ఎన్కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోనైనా కొంతమేర ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని భావనతో అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చర్చ జరుగుతోంది. మట్టుపెట్టింది అమాయకులనే ఎర్రచందనం కూలీలను అడవుల్లో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లరని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వారిపైన టాస్క్‌ఫోర్స్ ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయింది. కేవలం ఎర్రకూలీలను మాత్రమే మట్టుపెట్టింది. దీని పైన తమిళనాడులో సైతం తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కీలక ఆధారాల సేకరణ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులే ఇక్కడికి తరలించి మట్టుబెట్టి ఉంటారనే అనుమానాలు పోలీస్ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. ఎన్కౌంటర్ ప్రాంతంలో శవాలు ఒకేచోట పడి ఉన్న తీరు, ఎర్రకూలీల వద్ద పడి ఉన్న పాత ఎర్రచందనం దుంగలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఘటనా స్థలంలో 83 రూపాయలు విలువ చేసే బస్ టికెట్ పోలీసులకు లభ్యమైందని సమాచారం. దీని ఆధారంగా ఎర్రకూలీలు 105 కి.మీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఊత్తుకోట నుంచిగాని లేక వేలూరు నుంచి గానీ తిరుపతికి ప్రయాణించి ఉండవచ్చు. టికెట్ ఆధారంగా సోమవారం రోజున ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. మొత్తం మీద ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. తిరుమలలో పాగా సాక్షి, తిరుమల: శేషాచలంలో లభించే ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు, కూలీలు శ్రీవారి భక్తుల అవతారం ఎత్తుతున్నారు. తిరుమలలో ఉచిత భోజనం చేస్తూ, వసతి సముదాయాల్లో బసచేస్తూ, అదను చూసి అడవిలో చొరబడి విలువైన సంపదను కొల్లకొడుతున్నారు. అడ్డువచ్చిన అటవీ శాఖాధికారులను హతమార్చుతున్నారు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలోని శేషాచల అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటకలోని సరిహద్దు గ్రామాల నుంచి కూలీలు భక్తుల రూపంలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక్కడి ఉచిత వసతి సముదాయా ల్లో ఉంటూ, నిత్యాన్న ప్రసాదాన్ని భుజిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా రోజుల తరబడి తిష్టవేస్తారు. వాతావరణం అనుకూలించాక అడవుల్లోకి చొరబడుతున్నారు. జిల్లాలో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడులు ఇలా.. చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం చెట్లను నరకడానికి వచ్చే కూలీలతో పాటు స్మగ్లర్లు కూడా జిల్లాలో ఎన్నోమార్లు అల్లకల్లోలం సృష్టించారు. అడ్డొచ్చిన వారిని చంపడానికి ఏ మాత్రమూ ఆలోచించడం లేదు. ఎర్ర స్మగ్లర్లకు, పోలీసు అటవీ శాఖ అధికారుల మధ్య జరిగిన కొన్ని ఘటనలు... 2013 డిసెంబరులో శేషాచల అడవుల్లో పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య జరిగిన భీకరపోరులో అటవీశాఖ అధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్‌ను ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఈ దాడిలో పది మందికి పైగా సిబ్బంది గాయపడ్డారు. 2012లో భాకరాపేట చామలరేంజ్లోని కనుమలో అటవీశాఖ సిబ్బంది చొక్కలింగం, జయరామన్‌ను బంధించి వారిపై దాడి చేసి ఎర్రచందనం దుంగలను తీసుకుని పారిపోయారు. శ్రీకాళహస్తి అటవీశాఖలో సహాయ బీట్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను లారీతో ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు దుంగల్ని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిలోని టాస్క్ఫోర్సుకు చెందిన డెప్యూటీ రేంజ్ అధికారి మల్లికార్జున సైతం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా భారీ వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టి చంపేశారు. కుప్పం బాదూరు సమీపంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని వెంబడించిన టాస్క్ఫోర్సు వాహనాన్ని స్మగ్లర్లు భారీ వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 2014లో బెంగళూరులోని కటినగనహళ్లిలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడానికి వెళ్లిన ‘ఆపరేషన్రెడ్’లోని జిల్లాకు చెందిన పోలీసులపై విచక్షణారహితంగా భౌతిక దాడులకు తెగబడ్డారు. గత ఏడాది నవంబరులో పుత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఓ లారీని టాస్క్ఫోర్సు పోలీసులు వెంబడించారు. ఇందులో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ సుభాష్ లారీని గట్టిగా పట్టుకున్నాడు. స్మగ్లర్లు సుభాష్‌ను లారీలోనే లాక్కెళ్లి ఓ చెట్టుకు మోదించి వెళ్లిపోయారు. ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లిన సుభాష్ నాలుగు నెలల తర్వాత కోలుకున్నాడు. -
శేషాచలంలో పోలీసుల కాల్పులు
30 మంది ఎర్రచందనం కూలీల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఎర్రావారిపాళెం : శేషాచల అడవిలోకి ఎర్రచందనం స్మగ్లర్ల రాక ఆగడం లేదు. ఎన్కౌంటర్ జరుగుతున్నా, పీడీ యాక్ట్ అవులు అవుతున్నా వీరు భయపడటం లేదు. ఎర్రచందనం దుంగలను తరలించేందుకు అడవిలోకి వ స్తూనే ఉన్నారు. ఎదురుపడ్డ పోలీసులపైకి దాడులకు దిగుతూనే ఉన్నారు. ఆదివారం సైతం 30 మంది ఎర్రదొంగలు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా... ఎర్రావాపాళెం, భాకరాపేట సరిహద్దులోని పులిబోను అటవీ ప్రాంతం నుంచి 60 వుంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి కూంబింగ్ జరుపుతున్నారు. ఎండ తీవ్రతకు కూంబింగ్ జరుపుతున్న పోలీసులు అలసిపోయి దట్టమైన అటవీ ప్రాంతంలోని చెట్ల కింద సేదతీరారు. అదే సవుయుంలో నాలుగు వైపులా దారులు ఉన్న ఈ ప్రాంతానికి 30 వుంది తమిళ కూలీలు వచ్చారు. వారిలో ఇద్దరు కూలీలు పోలీసులను గుర్తించకుండా ముందుకు వచ్చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవు సహచర కూలీలు పోలీసులకు పట్టుబడ్డారని తెలుసుకుని మిగిలిన వారు పోలీసుల పైకి రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు 3 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. ఊహించని ఈ పరిణావూనికి ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. పట్టుబడ్డ కూలీలను జిల్లా కేంద్రానికి తరిలించి విచారిస్తున్నారు. మిగిలిన వారికోసం కూంబింగ్ చేపట్టారు. -
మూడు హెలికాప్టర్లతో ఆపరేషన్ శేషాచలం
-
మూడు హెలికాప్టర్లతో ఆపరేషన్ శేషాచలం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఏడు కొండల్లో ఒకటైన శేషాచలం మీద ఉన్న అడవుల్లో రేగిన కార్చిచ్చును చల్లార్చడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పుతున్నారు. శేషాచలం కార్చిచ్చుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మంటలు మరింత వ్యాపించకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అటవీ అధికారులతో ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి సమీక్షించారు. మంటలార్పడానికి కందకాలు తవ్వాలని నిర్ణయించారు. మరోవైపు మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కుమారధార, పసుపుధార డ్యాంల నుంచి హెలికాప్టర్ల ద్వారా పెద్ద పెద్ద కంటెయినర్లలో నీళ్లు తీసుకెళ్లి మంటల మీద చల్లుతూ వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీ సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. -
శేషాచలం జల్లెడ
=స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ =స్మగ్లర్లు, కూలీల కోసం =బృందాలుగా గాలింపు =అడవిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ నిషేధాజ్ఞలు సాక్షి, తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం సోమవారం స్పెషల్ పార్టీ పోలీసులు తిరుమల శేషాచలం కొండల్ని జల్లెడ పట్టారు. ఆదివారం ఉదయం స్మగ్లర్లు, కూలీల దాడిలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు హతమవటం, మరో ముగ్గురు సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో నిందితుల కోసం స్పెషల్‌పార్టీ పోలీ సులు గాలింపు వేగవంతం చేశారు. దట్టమైన అడవిలో కూం బింగ్ నిర్వహిస్తున్నారు. తిరుమల చుట్టూ అటవీప్రాంతాల్లోకి ఎవ్వరూ వెళ్లరాదని పోలీసులు, అటవీశాఖ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. కూంబింగ్‌లో చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శేషాచల కొండలకు పడమర దిశలో ఉన్న తలకోన, ఎర్రవారిపాళెం, భాకరాపేట, రంగంపేట నుంచి తిరుపతి వరకు స్పెషల్‌పార్టీ పోలీసులు బృందాలుగా విడిపోయి అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తూర్పు దిశలో కరకంబాడి, మామండూరు, బాలపల్లి, రైల్వే కోడూ రు, రాజంపేట సమీప అటవీమార్గంలోని గ్రామాల నుంచి అడవిలోకి వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. స్పెషల్ పార్టీ ఓఎస్డీ ఉదయ్‌కుమార్, డీఎస్పీ ఇలియాస్‌బాషా గాలింపు బృందాలకు నేతృత్వం వహించారు. మొత్తం ఎనిమిది బృందాలు అడవిలోకి వెళ్లాయి. ప్రతి బృందంలోనూ ఏకే47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రైనేడ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జరిగిన సంఘటనపై చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు, తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సమీక్షించారు. సంఘటన ఎలా జరిగింది? ఫారెస్ట్ అధికారుల వెంట సాయుధ పోలీసులు ఉంటే ఏవిధంగా ఉండేది? ఇద్దరు అధికారుల ప్రాణనష్టం? తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అడవిలోకి వెళ్లే ప్రతి సందర్భంలోనూ పోలీసులు వెంట ఉండాలనే విషయంపై కూడా కూలంకూషంగా చర్చించారు. మరోవైపు శేషాచల అడవులకు ఆనుకునే ఉన్న నల్లమల అడవుల్లో కూడా కర్నూలు జిల్లా స్పెషల్‌పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ? ఇద్దరు ఫారెస్ట్ అధికారులను హతమార్చి, మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో తమిళనాడుకు చెందిన నలుగురిని స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు సుమారు 50 మంది కూలీలను పట్టుకున్నా ఆదివారం జరిగిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురిని గుర్తించారు. సంఘటనలో పాల్గొన్న వారిని నేడో రేపో ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ జల్లెడ
పులిబోను(భాకరాపేట), న్యూస్‌లైన్ : శేషాచల అడవుల్లో ‘ఎర్ర’ కూలీల కోసం వుువ్ముర గాలింపు చర్యలు చేపట్టినట్టు టాస్క్‌ఫోర్స్ వోఎస్డీ ఉదయ్‌కువూర్, ఏఆర్ డీఎస్పీ దేవదాసులు తెలిపారు. శనివారం శేషాచల అ టవీ ప్రాంతంలోని పులిబోను బేస్‌క్యాంపు వద్ద విలేకరులతో వారు వూట్లాడారు. వుూడు రోజు లుగా శేషాచల అడవుల్లో పోలీసులు, ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గాలిం పు చేపట్టావున్నారు. 50 ఎర్రచందనం దుం గలు, గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శనివారం రాత్రి ఎర్రచందనం కూలీలు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి బేస్‌క్యాంప్‌లో ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులపై రాళ్లవర్షం కురిపించి కూలీలు చీకట్లో అటవీ ప్రాంతంలోకి జారుకున్నారని తెలిపారు. ‘ఎర్ర’ కూలీలు హద్దుమీరితే కాల్పులకూ వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు శేషాచల అడవుల్లో జల్లెడపడుతున్నట్టు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే దారులన్నీ మూసివేశామన్నారు. అనంతరం పులి బోను నుంచి కరివేపాకు కోనకు వెళ్లి ఎర్రచందనం దుంగలు నరికిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. ప్రస్తుతం ఎర్రచందనం దుంగలను రెండు, మూడు అడుగుల పొడవు, చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి దుండగులు తరలిస్తున్నట్టు తెలిపారు. చంద్రగిరి, కొటాల, పనబాకం రైల్వేస్టేషన్ల నుంచి సంచుల్లో తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ గాలింపుల్లో భాకరాపేట ఎస్ఐ నెట్టికంఠయ్యు, ఏఆర్ ఎస్ఐ వుదు, భాకరాపేట పీఎస్ఐ రహీవుుల్లా, పోలీసులు, ఫారెస్టు అధికారులు కన్నయ్యు పాల్గొన్నారని వివరించారు.