- 30 మంది ఎర్రచందనం కూలీల దాడి
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
ఎర్రావారిపాళెం : శేషాచల అడవిలోకి ఎర్రచందనం స్మగ్లర్ల రాక ఆగడం లేదు. ఎన్‌కౌంటర్ జరుగుతున్నా, పీడీ యాక్ట్ అవులు అవుతున్నా వీరు భయపడటం లేదు. ఎర్రచందనం దుంగలను తరలించేందుకు అడవిలోకి వ స్తూనే ఉన్నారు. ఎదురుపడ్డ పోలీసులపైకి దాడులకు దిగుతూనే ఉన్నారు. ఆదివారం సైతం 30 మంది ఎర్రదొంగలు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలిలా... ఎర్రావాపాళెం, భాకరాపేట సరిహద్దులోని పులిబోను అటవీ ప్రాంతం నుంచి 60 వుంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి కూంబింగ్ జరుపుతున్నారు. ఎండ తీవ్రతకు కూంబింగ్ జరుపుతున్న పోలీసులు అలసిపోయి దట్టమైన అటవీ ప్రాంతంలోని చెట్ల కింద సేదతీరారు. అదే సవుయుంలో నాలుగు వైపులా దారులు ఉన్న ఈ ప్రాంతానికి 30 వుంది తమిళ కూలీలు వచ్చారు. వారిలో ఇద్దరు కూలీలు పోలీసులను గుర్తించకుండా ముందుకు వచ్చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తవు సహచర కూలీలు పోలీసులకు పట్టుబడ్డారని తెలుసుకుని మిగిలిన వారు పోలీసుల పైకి రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు 3 రౌండ్‌లు గాలిలో కాల్పులు జరిపారు. ఊహించని ఈ పరిణావూనికి ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. పట్టుబడ్డ కూలీలను జిల్లా కేంద్రానికి తరిలించి విచారిస్తున్నారు. మిగిలిన వారికోసం కూంబింగ్ చేపట్టారు.