హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో జరిగిన 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. శేషాచలం ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించిన నివేదికను సోమవారం సిట్ అధికారులు హైకోర్టుకు అందజేశారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ లోఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు.
కాగా, సిట్ విచారణ సరిగా లేదని.. ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తు కొనసాగుతోందని బాధితుల తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిట్ విచారణపై నమ్మకం లేదని.. శేషాచలం ఎన్ కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారణ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. దీంతో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను రీఎగ్జామ్ చేయాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. తమిళనాడులో సాక్షుల స్వగ్రామాలకు వెళ్లి అడ్వకేట్ల సమక్షంలో స్టేట్ మెంట్ తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. అవసరమైతే తమిళనాడు పోలీసులను రక్షణగా తీసుకువెళ్లాలని సూచించింది.