శేషాచలంలో అగ్ని ప్రమాదం | fire accident in seshachalam | Sakshi
Sakshi News home page

శేషాచలంలో అగ్ని ప్రమాదం

Published Tue, Nov 22 2016 3:04 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in seshachalam

సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు మార్గం లోని 22వ మలుపు వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి. దట్టమైన పొగ ఎగిసిపడటంతో గమనిం చిన భక్తులు టీటీడీ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందిం చారు. అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కార్చిచ్చు వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులు ఎండిపోయి, రాపిడి వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement